అద్భుతమైన ఎలక్ట్రిక్‌ బైక్: ఒక్క యూనిట్ కరెంట్ చార్జింగ్ తో ఏకంగా 100 కి.మీ. పయనం...!

జనాలలో అవేర్నెస్ బాగా పెరిగింది.పర్యావరణ పరిరక్షణలో భాగంగా పెట్రోలు, డీజల్ వాడకానికి బదులుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకానికి మొగ్గు చూపుతున్నారు.

 Atumobile Launches Electric Bike Atum 1 0-TeluguStop.com

అందువలన వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడంలో బిజీ అయ్యాయి.ఇప్పటికే పలు విదేశీ కంపెనీలు చాలా రకాల వాహనాలను లాంచ్ చేసిన సంగతి తెలిసినదే.

ఇకపోతే, ఇప్పుడు ఇక్కడే మన హైదరాబాద్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ ‌వారు ఓ ఎలక్ట్రిక్ మోడల్ బైక్ ను లాంచ్ చేయడం విశేషం.
విశాఖ ఇండస్ట్రీస్, ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ స్టార్టప్‌ ఆటమ్‌ మొబైల్‌ పేరిట మార్కెట్లోకి ‘ఆటమ్‌ 1.0 న్యూ జనరేషన్‌ ఎలక్ట్రిక్‌ బైక్‘‌ను విడుదల చేసి సంచలనం సృష్టించింది.ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 100 కిలో మీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చని కంపెనీ ఫౌండర్‌ జి.వంశీ గడ్డం పేర్కొన్నారు.బైక్‌ ప్రారంభ ధర సుమారుగా రూ.50 వేలు అని తెలుస్తోంది.దీని తయారీ కేంద్రం పటాన్‌ చెరులో ఉంది.

 Atumobile Launches Electric Bike Atum 1 0-అద్భుతమైన ఎలక్ట్రిక్‌ బైక్: ఒక్క యూనిట్ కరెంట్ చార్జింగ్ తో ఏకంగా 100 కి.మీ. పయనం…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1,500 బైక్స్‌ కాగా.డిమాండ్‌ ను బట్టి అదనంగా 1000 బైక్‌ లను ఉత్పత్తి చేస్తామని వంశీ తెలిపారు.

ఇక ఈ బైక్ స్పెసిఫికేషన్స్ చూస్తే… పోర్టబుల్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ కలిగి ఉండి, 2 సంవత్సరాల వారంటీ పొందవచ్చు.ఇక అలాగే కేవలం 6 కిలోల తేలికపాటి పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది.ఇక ఈ బైక్ ఉపయోగాలు చూస్తే… మాములు ఐసీఈ బైక్‌ లతో పోలిస్తే ఆటమ్‌ 1.0 రోజువారీ ఖర్చు చాలా తక్కువ.4 గంటల్లో ఫుల్‌ చార్జింగ్‌ అవుతుంది.ఇంతసేపు ఛార్జింగ్ చేసిన కేవలం చార్జింగ్‌కు ఒక యూనిట్‌ మాత్రమే తీసుకుంటుంది.

అలాగే ఎలాంటి పర్యావరణానికి హాని చేయదు.

#AtumobileBike #Diesel #Byke #Petrol #India

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు