న్యూయార్క్ లో ప్రవాస భారతీయుడికి అరుదైన గుర్తింపు..       2018-06-22   03:58:32  IST  Bhanu C

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ మరియు బర్క్‌షైర్‌ హాత్‌ ఎవే, జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ల జాయింట్ వెంచర్‌ అయిన అమెరికా ఉద్యోగుల హెల్త్‌ కేర్‌ సంస్థకు సీఈవోగా ఇండో అమెరికన్ ప్రముఖ సర్జన్‌, రచయిత డా. అతుల్ గవాండే ని వరించింది..ఈ సంస్థకి ఆయనే సీఈవోగా ఉండాలని ఈ దిగ్గజ సంస్థలు పట్టుబట్టి మరీ అతుల్ ని నియమించాయట..ఈ భాద్యతలని అతుల్ జులై 9 న స్వీకరించనున్నారు.అయితే ఈ విషయంపై అతుల్ మాట్లాడుతూ నన్ను ఈ కంపెనీకి సీఈవోగా చేయడం ఆనందంగా ఉంది. నా బాధ్యతల పట్ల నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు..

ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యమైన విషయం అందుకే పబ్లిక్‌ హెల్త్‌ మీద ఉద్యోగులకు మరింత అవగాహన కల్పించి.. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కావల్సిన నూతన పద్ధతులను అమలు చేస్తానని ఆయన అన్నారు..అయితే నన్ను ఎంపిక చేసిన సంస్థలు అన్నీ ఎంతో ఉన్నతమైన సంస్థలని వారు నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాల తెలిపారు..ప్రస్తుతం ఉన్న పద్ధతులని నా ఆలోచన మేర మార్చాలని అనుకుంటున్నాను కొత్త విధానాలని ప్రవేశ పెడుతానని ఆయన తెలిపారు.

అతుల్‌ నియామకంపై బర్క్‌షైర్‌ హాత్‌ ఎవే ఛైర్మన్‌, సీఈవో వారెన్‌ బఫెట్‌ మాట్లాడుతూ..” ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లలో అందరికంటే..అతుల్‌ అంకిత భావం, ప్రతిభ మమ్మల్ని ఎంతో ఆకట్టుకున్నాయి” ..భారతీయుల ప్రతిభ అమోఘం అని అన్నారు…అమెజాన్‌ సీఈవో జెఫ్‌బెజొస్‌ మాట్లాడుతూ…”ఉన్నత డిగ్రీలు సంపాదించిన సిబ్బంది చాలామందే ఉంటారు. కానీ అందులో చాలా కొద్ది మందికే అత్యున్నత విజ్ఞానం, తెలివి ఉంటాయి అంటూ అతుల్ ని పొగడ్తలతో నింపేశారు..అతుల్ రచయితగా, పబ్లిక్‌ హెల్త్‌ లో ఆయన చేసిన సేవలకు గానూ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు