అమిత్ షా ఆ విషయం చెప్పేస్తారా ? తెలంగాణ బీజేపీ నేతల టెన్షన్ ? 

 తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో కేంద్ర బిజెపి నాయకులు ఒక రకంగా, తెలంగాణ బిజెపి నాయకులు మరోలా వ్యవహరిస్తుండడంతో, ఈ విషయం పై అనేక అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.టిఆర్ఎస్, బిజెపిల మధ్య రహస్య ఒప్పందం ఉంది అని, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు జనాల్లో ప్రాధాన్యం పెరిగింది.

 Attempts By Telangana Bjp Leaders To Criticize Trs With Amit Shah-TeluguStop.com

ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య పొత్తు ఉండే ఉంటుందని, అందుకే కేసీఆర్ ఢిల్లీ టూర్ లో కేంద్ర బిజెపి పెద్దలు అంతగా ప్రాధాన్యత ఇచ్చి కెసిఆర్ తమకు బాగా కావాల్సిన వాడు అనే సంకేతాలు ఇచ్చారనే అభిప్రాయం జనాల్లోకి వెళ్లిపోయింది.ఈ వ్యవహారాలు తెలంగాణ బిజెపి నాయకులకు పెద్ద తలనొప్పిగా మారాయి.

తెలంగాణ లో ప్రధాన ప్రత్యర్థిగా టిఆర్ఎస్ ను చూస్తూ, ఆ పార్టీపై తాము నిరంతరం పోరాటం చేస్తున్నామని, హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మరింతగా హైలెట్ చేస్తున్న సమయంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకుని బిజెపి పెద్దలను కలవడం, వారు సానుకూలంగా వ్యవహరించడం వంటివన్నీ పూర్తిగా తెలంగాణ బిజెపి కి చేటు తెచ్చాయని, ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

 Attempts By Telangana Bjp Leaders To Criticize Trs With Amit Shah-అమిత్ షా ఆ విషయం చెప్పేస్తారా తెలంగాణ బీజేపీ నేతల టెన్షన్  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వ్యవహారంలో సరైన క్లారిటీ ఇవ్వకపోతే మొదటికే మోసం వస్తుందని నమ్ముతున్నారు.

దీనిలో భాగంగానే ఈనెల 17వ తేదీన నిర్మల్ లో జరగనున్న అమిత్ షా సభలోనే టిఆర్ఎస్ విషయంలో క్లారిటీ ఇవ్వాలని, తెలంగాణ విమోచన దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న అమిత్ షా ద్వారానే టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేయించాలని , ఆ పార్టీ విషయంలో తాము ఎప్పుడు సానుకూలంగా ఉండమని ఆ పార్టీ తమకు ఎప్పటికీ రాజకీయ శత్రువు అనే విషయాన్ని తెలంగాణ బిజెపి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Amith Sha, Bandi Sanjay, Bjp, Central Home Minister, Congress, Etela Rajendar, Hujurabad Elections, Kcr Delhi Tour, Kishan Reddy, Pcc Chief Revanth Reddy, Telangana-Telugu Political News

 అమిత్ షా వంటి వారితో ఈ విధమైన ప్రసంగం చేయించి బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ మరింత ఇబ్బందులు పడుతున్న టెన్షన్ అటు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి వంటి వారు అభిప్రాయపడుతున్నారు.మరి అమిత్ షా ఈ విషయంలో ఏ విధంగా ప్రసంగం చేస్తారు అనే దానిపైనే తెలంగాణ బిజెపి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

#Amith Sha #PCCChief #CentralHome #Telangana #Bandi Sanjay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు