రేవంత్ కు క్రెడిట్ రాకుండా సీనియర్ల వ్యూహం ఇదేనా ?

తెలంగాణలో రేవంత్ రెడ్డి అనే పేరుకు ఒక ఇమేజ్ ఉంది.ప్రస్తుత పరిణామాలకు అనుగుణంగా రాజకీయాలు చేసుకుంటూ, ఎప్పటికప్పుడు యాక్టివ్ గా రేవంత్ ఉంటారు.

 Attempts By Congress Seniors Not To Give Credit To Rewanth Reddy In Nagarjuna Sa-TeluguStop.com

ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గానూ, మల్కాజ్ గిరి ఎంపీ గాను రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ కు ఒక గుర్తింపు తీసుకు రావడంతో పాటు, ఆ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలనే ఆకాంక్షతో ఉన్నారు.అందుకే తెలంగాణలో బలంగా ఉన్న టిఆర్ఎస్ పార్టీని డి కొడుతూ బీజేపీకి క్రెడిట్ దక్కకుండా చేస్తూ రేవంత్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

పార్టీ సీనియర్ నాయకుల సహకారం సైతం అంతంతమాత్రంగానే ఉంటూ వస్తోంది.దీంతో రేవంత్ అనుకున్న మేరకు సక్సెస్ కాలేకపోతున్నారు.

సొంత పార్టీ నాయకులు కారణంగా తమ పార్టీ పరిస్థితి ఈ విధంగా తయారైందని రేవంత్ కు తెలిసినా, సైలెంట్ గానే తన రాజకీయాన్ని చేసుకుంటూ వస్తున్నారు.ఇటీవల జరిగిన ఉప ఎన్నికలతో పాటు, జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ రేవంత్ గట్టిగానే ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇప్పుడు  నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.ఇక్కడ రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించి, కాంగ్రెస్ అభ్యర్థికి విజయం  తీసుకురావాలని చూస్తున్నారు.

కానీ రేవంత్ విషయంలో మాత్రం నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్లు అంత సుముఖంగా లేరట.ఎందుకంటే ఇక్కడ టి ఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తోంది.

ఇక్కడ కాంగ్రెస్ తరపున రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే, ఇక్కడ పార్టీ అభ్యర్థి గెలిస్తే, ఆ క్రెడిట్ రేవంత్ పై పడుతుందని, దీనిద్వారా అధిష్ఠానం పెద్దల వద్ద రేవంత్ హవా పెరగడంతో పాటు, పిసిసి అధ్యక్ష బాధ్యతలు సైతం ఆయనకు కట్టబెట్టేందుకు అధిష్టానం మొగ్గు చూపుతుంది అనే ఆలోచనతో ఎన్నికల ప్రచారానికి దూరం పెట్టాలని చూస్తున్నారట.

Telugu Congress, Jana Reddy, Nagarjuna Sagar, Revanth Reddy, Telangana-Telugu Po

వారి ఆలోచనలకు తగ్గట్టుగానే ప్రస్తుతం కరోనా పాజిటివ్ రేవంత్ రెడ్డికి సోకడంతో,  హోం ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి.కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత రేవంత్ యథావిధిగా ఎన్నికల ప్రచారానికి వెళ్దామని చూస్తున్నా, సీనియర్లు మాత్రం రేవంత్ ఎన్నికల ప్రచారానికి రాకుండా చూడాలని భావిస్తున్నారట.ఎందుకంటే నాగార్జునసాగర్ ఎన్నికల తర్వాత తెలంగాణ పిసిసి అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని , ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తే ఆ క్రెడిట్ రేవంత్ వేసుకుని పిసిసి అధ్యక్ష పదవి దక్కించుకుంటారు అని కాంగ్రెస్ లోని రేవంత్ వ్యతిరేక వర్గం అభిప్రాయపడుతోందట.

అందుకే సాగర్ ఎన్నికల్లో రేవంత్ సందడి కనిపించే అవకాశం లేనట్టుగానే కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube