పవన్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ పరువు తీశారు.. మరీ ఇంత దారుణంగా ఫ్లాప్‌ ఏంటీ బాసూ  

  • టాలీవుడ్‌లో పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయిలో వసూళ్లు దక్కించుకుని పవన్‌ కెరీర్‌లోనే నిలిచి పోయే విజయాన్ని సొంతం చేసుకున్న అత్తారింటికి దారేది చిత్రం తమిళనాట తాజాగా రీమేక్‌ అయ్యింది. తెలుగు సినిమాలు తమిళంలో, తమిళ సినిమాలు తెలుగులో రీమేక్‌ అవ్వడం చాలా కామన్‌. అయితే తమిళంలో తెలుగు సినిమాలు ఎక్కువగా సక్సెస్‌ అయిన దాఖలాలు లేవు. ఆ కారణంగానే తెలుగు సినిమాలు ఎక్కువగా అక్కడ రీమేక్‌ అవ్వవు. ఈ నేపథ్యంలోనే తెలుగు సినిమా అత్తారింటికి దారేది చిత్రం తమిళంలో రీమేక్‌ అయ్యింది.

  • తమిళ స్టార్‌ డైరెక్టర్‌ సుందర్‌ సి దర్శకత్వంలో శింబు హీరోగా రూపొందిన అత్తారింటికి దారేది రీమేక్‌ చిత్రం రాజా వందాన్‌ వరువేన్‌ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం నిన్న అక్కడ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం నిరాశ పర్చడంతో శింబు కూడా నిరాశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో మంచి ఎంటర్‌టైనర్‌గా అత్తారింటికి దారేది చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కించాడు. అయితే అదే ఎంటర్‌టైన్‌మెంట్‌ను అక్కడ కాస్త ఎబ్బెట్టుగా చూపించారు

  • Attarintiki Daredi Remake Vantha Rajavathaan Varuven Gets Flop Talk-Director Sundar C Rajavathaan Talk Simbu

    Attarintiki Daredi Remake Vantha Rajavathaan Varuven Gets Flop Talk

  • పవన్‌ కళ్యాణ్‌ స్టార్‌డంకు తోడుగా పవర్‌ ఫుల్‌ కథ, ఆకట్టుకునే త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లేతో సినిమా స్థాయి అమాంతం పెరగింది. కాని తమిళ రీమేక్‌ మాత్రం ఆకట్టుకోలేదు. అందుకు ప్రధాన కారణం సినిమాలోని శింబు ఓవర్‌ యాక్షన్‌ అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో పలు సీన్స్‌లో శింబు చేసిన ఓవర్‌ యాక్షన్‌ వల్ల సినిమా ఫ్లాప్‌ అయ్యిందని టాక్‌ వినిపిస్తుంది. తెలుగు బ్లాక్‌ బస్టర్‌ మూవీ పరువును అక్కడ తీశారంటూ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతకానప్పుడు ఎందుకు రీమేక్‌ బాధ్యతలు నెత్తికి ఎత్తుకోవాలంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.