అత్తారింటికి దారేది చిత్రంతో గీత గోవిందంకు పోలిక..!  

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు స్థాయిలో వసూళ్లను సాధిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు, విశ్లేషకులు, సినీ వర్గాల వారు ఇలా అంతా కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల వారికి నచ్చిన చిత్రంగా ఈ చిత్రం పేరు తెచ్చుకుంది. ఇంతటి సంచలన విజయాన్ని దక్కించుకున్న గీత గోవిందం చిత్రం విడుదలకు ముందే దాదాపుగా సినిమా మొత్తం లీక్‌ అయిన విషయం తెల్సిందే. సినిమా విడుదలకు 10 రోజుల ముందు సినిమా గూగుల్‌ డ్రైవ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు పోస్ట్‌ చేశారు.

Attarintiki Daredi Compared To Geetha Govindam Movie-

Attarintiki Daredi Compared To Geetha Govindam Movie

సినిమా మొత్తం కూడా గూగుల్‌ డ్రైవ్‌లో పోస్ట్‌ అవ్వడంతో సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురి అయ్యారు. నిర్మాత అల్లు అరవింద్‌ అసలు సినిమా పరిశ్రమ నుండి తప్పుకోవాలన్నంత కోపంగా ఉంది అంటూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. ఇక విజయ్‌ దేవరకొండ కూడా ఈ విషయమై కాస్త సీరియస్‌గానే స్పందించాడు. అయితే సినిమా ఫలితం సూపర్‌ హిట్‌ అవ్వగానే లీక్‌కు కారణంగా చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. కావాలని, పబ్లిసిటీ కోసం యూనిట్‌ సభ్యులు లీక్‌కు పాల్పడి ఉంటారు అంటున్నారు.

Attarintiki Daredi Compared To Geetha Govindam Movie-

లీక్‌ విషయంలో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. గీత గోవిందం చిత్రం సినిమా మొత్తం లీక్‌ అయినప్పుడు ఎంతో బాధ వేసింది. మేము లీక్‌ చేశాం అన్నప్పుడు ఇంకాస్త బాధగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం లీక్‌ వల్ల తకు చాలా నష్టం జరిగిందని చెబుతున్నాడు. ఇక ఈ చిత్రం లీక్‌తో పవన్‌ కళ్యాణ్‌ అత్తారికింటికి దారేది చిత్రంతో పోల్చుతున్నారు. పవన్‌ నటించిన అత్తారింటికి దారేది చిత్రాన్ని కూడా విడుదలకు ముందే కొందరు మొత్తం సినిమాను లీక్‌ చేశారు. దాంతో అప్పుడు సినిమా పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది.

‘అత్తారికింటికి దారేది’ చిత్రం విడుదలకు ముందే మొత్తం లీక్‌ అయ్యి ఘన విజయాన్ని దక్కించుకున్న ఆ చిత్రం దారిలోనే తాజాగా వచ్చిన గీత గోవిందం చిత్రం కూడా లీక్‌ అయ్యి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అత్తారికింటికి దారేది చిత్రం రికార్డులు సృష్టించింది. టాలీవుడ్‌ నెం.1 చిత్రంగా అప్పట్లో నిలిచింది. తాజాగా ఈ చిత్రం కూడా చిన్న బడ్జెట్‌ చిత్రాల్లో నెం.1 చిత్రంగా నిలిచింది. పెద్ద సినిమాలకు సైతం పోటీ పడుతోంది. అందుకే గీత గోవిందంకు అత్తారింటికి దారేది చిత్రానికి పోలికలు ఉన్నాయి అంటున్నారు.