వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై దాడికి యత్నం !  

ycpmp , ysrcp, ycp , Nandigam Suresh, cm jagan, bhapatla mp - Telugu Bhapatla Mp, Cm Jagan, Nandigam Suresh, Ycp, Ycpmp, Ysrcp

బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ ఆయన గన్ మెన్స్ , వెంటనే అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

TeluguStop.com - Attack On Ysrcp Mp Nandigam Suresh

ఎంపీ పై దాడికి ప్రయత్నించినా వ్యక్తిని మందడం గ్రామానికి చెందిన బత్తుల పూర్ణచంద్రరావుగా గుర్తించారు.ఈ ఘటన గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో గత రాత్రి 10.30 గంటల సమయంలో చోటు చేసుకుంది.

గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఎంపీ సురేశ్ ఉద్ధండరాయునిపాలెంలోని తన ఇంటి నుంచి కారులో బయలుదేరుతుండగా.పూర్ణచంద్రరావు ఆయన వాహనానికి బైక్ అడ్డుపెట్టి దూషించడం మొదలుపెట్టాడు.

TeluguStop.com - వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై దాడికి యత్నం -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దాడి చేసేందుకు మీదకు రావడంతో అప్రమత్తమైన ఎంపీ భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకున్నారు.అతని వద్ద నుంచి ఇనుప రాడు లభించింది.

అయితే అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించిన పూర్ణచంద్రరావును భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే దాడికి యత్నించిన పూర్ణచంద్రరావు టీడీపీకి చెందిన వ్యక్తి అని వైసీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

#Ycpmp #CM Jagan #Bhapatla Mp #Ysrcp #Nandigam Suresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Attack On Ysrcp Mp Nandigam Suresh Related Telugu News,Photos/Pics,Images..