కోడి కత్తి కేసు : ఇన్ని మలుపులు....ఇన్ని ట్విస్ట్ లు ఏంటి ...?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మీద విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది.తాజాగా ఈ వ్యవహారంపై విశాఖ పోలీసు కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా అక్టోబర్‌ 25న జగన్‌పై దాడి వ్యవహారం పై స్పందించారు.

 Attack On Ys Jagan Turns Another Way Of Twist-TeluguStop.com

అయితే సీపీ చెప్పిన వివరాలు అనేక అనుమానాలు కలుగుతున్నాయి.దాడి జరిగిన రోజున నిందితుడు శ్రీనివాస్‌ ఉదయం 8 గంటలకు హేమలత, అమ్మాజీ అనే ఇద్దరు మహిళలకు ఫోన్‌ చేసి ‘ఈ రోజు నన్ను టీవీలో చూస్తారు’ అని, అమ్మాజీతో ‘ఒక సంచలనం చూస్తారు’ అంటూ అనేకసార్లు శ్రీనివాస్‌ చెప్పాడని సీపీ వివరించారు.

అంతే కాదు….ఎంపీ, ఎమ్మెల్యే ల వద్ద ఉన్నట్టే… నా దగ్గర కూడా పీఏ అపాయింట్‌మెంట్‌ తీసుకొని రావాలని ఆమెతో చెప్పాడని సీపీ వివరించారు.దాడి జరిగిన రోజు ఉదయం 9 గంటల సమయంలో ఎయిర్ పోర్టులోని రెస్టారెంట్‌లో కూడా కోడికత్తికి సానపెట్టాడని తెలిపారు.రెండుసార్లు కోడికత్తిని వేడి నీటిలో స్టెరిలైజ్‌ చేశాడని విచారణలో తేలిందట.

జగన్‌పై అక్టోబర్‌ 18నే దాడికి శ్రీనివాస్‌ పథక రచన చేశాడని, అక్టోబర్‌ 17నే జగన్‌ విశాఖ నుంచి వెళ్లిపోవడంతో అతడి ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు అని సీపీ చెప్పుకొచ్చారు.

జాతీయ సంస్థలు చెయ్యల్సిన దర్యాప్తు రాష్ట్రప్రభుత్వాన్ని కాపాడటం కోసం ఇక్కడి పోలీసులు చేస్తున్నారనే ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు.జాతీయ భద్రతా అంశాలు ఉంటేనే ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుందని, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని గంటల్లోనే వివరాలు చెప్పాల్సి వచ్చిందని స్పష్టంచేశారు.అయితే సీపీ చెప్పిన వివరాలను పరిశీలిస్తే….

కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్లాన్ చేసినట్టు అర్ధం అవుతోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని ప్రత్యక్ష సాక్షి వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ స్పష్టం చేశారు.

ఇది చాలా ప్రమాదకరమైన అటాక్‌ అన్నారు.దేవుడు, ప్రజల ఆశీస్సులతోనే జగన్ తప్పించుకున్నారని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube