సీఎం మమత పై అనూహ్య విజయం సాధించిన సువేందు అధికారి పై దాడి.. ?

పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న విడుదలైన విషయం తెలిసిందే.కాగా నందిగ్రాం లో పోటి చేసిన మమత మొదటి నాలుగు రౌండ్లు పూర్త‌య్యే స‌మ‌యంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే 8,000 ఓట్ల వెనుకంజ‌లో ఉండగా, అనంత‌రం రౌండ్ల‌లో మాత్రం ఆమె అనూహ్యంగా పుంజుకున్నారు.

 Attack On Suvendu Adhikari By Unidentified Persons, West Bengal, Assembly Electi-TeluguStop.com

కానీ చివరికి స్వల్ప ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి, మమతపై విజయం సాధించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఈ గెలుపే గొడవలకు దారితీసింది.

మమతపై విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కారుపై రాళ్ల దాడి జరిగింది.సువేందు అధికారి ఈసీ కార్యాలయం నుండి గెలుపు పత్రాన్ని తీసుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఆయన కారుపై దుండగులు రాళ్లతో విరుచుకుపడ్డారట.

ఇదే సమయంలో అరామ్ బాగ్ ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు.మొత్తానికి బీజేపీ విజయం వివాదాలకు దారి తీసిందని అనుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube