బ్రిటన్ లో భారత విధ్యర్ధి పై దాడి.. గో బ్యాక్ అంటూ నిరసనలు.       2018-06-14   03:27:08  IST  Bhanu C

విదేశాలలో ఉంటున్న భారత ఎన్నారైల పై మళ్ళీ దాడులు మొదలయ్యాయి.,..ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మీరు ఏమి చేస్తారు అంటూ మళ్ళీ మాటల యుద్ధం మొదలవుతోంది..అమెరికాలో గత సంవత్సరం లో జరిగిన జాత్యహంకార దాడిలో చనిపోయిన శ్రీనివాస్ ఉదంతం మరి కొంతమంది విద్యార్ధులు ఉద్యోగులపై జరిగిన దాడుల నేపధ్యం మరువక ముందే ఈ సారి బ్రిటన్ లో జరిగిన ఈ జాత్యహంకార దాడి పై భర్త ఎన్నారైలు ఆందోళన చెందుతున్నారు..వివరాలలోకి వెళ్తే..

రికేశ్‌ ఆడ్వాణీ అనే భారతీయ యువకుడు కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో రాజకీయ తత్వశాస్త్రం చదువుతున్నాడు అయితే ఒకానొక సందర్భంలో అతడు కేంబ్రిడ్జ్‌ ఆస్పత్రికి వెళ్లాడు. ముఖానికి ముసుగు వేసుకొన్న ఓ మహిళ ఆ ఆస్పత్రిలో చూపించుకోవడానికి వచ్చింది…ఆ సమయంలో ఆమె తన బ్యాగు తీసుకోవడానికి వంగినప్పుడు అక్కడే ఉన్న ఓ తెల్ల జాతీయుడు…ఆమెను చూస్తూ నవ్వుతూ లైంగిక కోరికను వచ్చే విధంగా చాలా నీచమైన మాటలు మాట్లాడాడు.

దాంతో ఈ విషయం గమనిస్తున్న భారత విద్యార్ధి రికేస్..అలా మాట్లాడటం మంచిది కాదు అంటూ వారిచాడు..దాంతో అతడు ఒక్కసారిగా రికేశ్‌పై చెలరేగిపోయాడు. నోటికొచ్చినట్టు తిట్టాడు. “పైప్‌ డౌన్‌” అంటూ అసభ్యకరమైన బాషని ఉపయోగించాడు..అంతేకాదు యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బయటకు రావడానికి సంబంధించి బ్రిటన్‌లో ఇటీవల నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ అయిన “బ్రెడ్జిట్‌’” ను దృష్టిలో ఉంచుకొని.. “బ్రెడ్జిట్‌ గో బ్యాక్‌ హోం” అంటూ పిచ్చి పిచ్చిగా కేకలు పెట్టాడు..

అయితే అక్కడ ఇంత తతంగం జరుగుతున్నా సరే అతడిని అడ్డుకోవడానికి ఎవరూ ప్రయత్నం చేయలేదు సరికదా ఎవరి పని వారు చేసుకున్నారు రికేస్ అనంతరం పోలీసులకు ఆ తెల్ల జాతీయునిపై ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఘటనకి సంభందించి పోలీసులు ఎవరిని ఎదుపులోకి తీసుకోలేదు..అయితే ఈ ఒక్కసారిగా భారత ఎన్నారైలు ఉలిక్కి పడ్డారు..ఎంతో కాలంగా సైలెంట్ గా ఉన్న జాత్యహంకార కోపం మళ్ళీ ఒక్కసారిగా బయటకి రావడంతో ఇంకెన్ని ఘటనలు జరుగుతాయో అని కంగారు పడుతున్నారు. భారత ఎన్నారైలు.