ఎన్నికల ప్రచారంలో మోత్కుపల్లిపై దాడి   Attack On Congress Leders To Motkupalli Narasimhulu     2018-10-30   21:44:36  IST  Sai M

తెలంగాణ లో సీనియర్ పొలిటీషియన్ … టీడీపీలో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం రాజకీయ ఉనికి కోసం ఆరాటపడుతున్న మోత్కుపల్లి నరసింహులుపై దాడి జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఉన్న మోత్కుపల్లి నర్సింహులుపై కాంగ్రెస్ నేత బూడిద భిక్షమయ్యగౌడ్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో అక్కడే ఉన్న భిక్షమయ్యగౌడ్ తన అనుచరులను వారించే ప్రయత్నం చేయలేదు.

దీంతో దాడిచేసిన భిక్షమయ్య గౌడ్, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలంటూ మోత్కుపల్లి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2009లో ఆలేరు నియోజకవర్గం నుంచి భిక్షమయ్యగౌడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో ఆలేరులో పోటీ చేసేందుకు మోత్కుపల్లి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) పార్టీ ఇటీవల విడుదల చేసిన రెండో జాబితాలో మోత్కుపల్లి పేరును చేర్చింది.