టీఆర్ఎస్ నాయకులే టార్గెట్ గా మావోయిస్టుల రెక్కీ !  

Attac To Trs Leaders Maoists Palan-

ప్రస్తుతం తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. నాయకులంతా ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతుండగా… ఇదే అదునుగా భావిస్తున్న మావోయిస్టులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే టార్గెట్ గా తమ ప్రతాపం చూపించేందుకు సిద్ధం అవుతున్నారు. ఏపీలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోములను ఎలాగైతే హత్య చేశారో అదే తరహాలో. తెలంగాణలోని ఎమ్మెల్యేలను అంతం చేస్తామని మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మావోయిస్టు యాక్షన్‌ టీమ్స్‌. తెలంగాణకు చెందిన ఓ ఆపద్ధర్మ మంత్రి, స్పీకర్‌ను టార్గెట్‌ చేసినట్టు సమాచారం. అదేవిధంగా తాడ్వాయి టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించినట్టు సమాచారం. .

--అయితే… మావోయిస్టుల కుట్రను ముందుగానే… పసిగట్టిన తెలంగాణ పోలీసులు అలర్ట్‌ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మావోయిస్టుల ముప్పు గురించి పోలీసులు సమాచారం ఇవ్వడంతో మంత్రి అజ్మీరా చందూలాల్‌ తాడ్వాయ్ మండలంలోని కటాపూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ముగించి వెనుదిరిగారు.

ఈ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా రంగంలోకి దిగిన 30 మంది మావోయిస్టులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.