ఎప్పుడు గొడవపడుతుండే అత్తా కోడళ్ళు ఈ కథ తప్పక చదవండి.! భ‌ర్త‌ కూడా అత్త‌కే స‌పోర్ట్ చేయ‌డంతో రాధ‌…!

రాధ‌కు కొత్త‌గా పెళ్ళైంది… కొన్ని రోజుల కాపురం తర్వాత అత్త మీద కోపం పెరిగిపోయింది రాధ‌కు.! ప్ర‌తి ప‌ని త‌న‌కే చెబుతుంద‌నీ, త‌న భ‌ర్త‌కు త‌న‌కు మ‌ద్య చిచ్చు పెడుతుంద‌నీ, త‌న‌ను తక్కువ చేసి చూస్తుంద‌నీ.

 Atta Kodalu Interesting Story-TeluguStop.com

ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలతో అత్తను చూస్తేనే చంపేయాల‌న్నంత కోపాన్ని పెంచుకుంది కొత్త పెళ్ళికూతురు.!

ఓసారి అత్తాకోడ‌ళ్ళ మ‌ద్య పెద్ద గొడ‌వైంది…త‌న భ‌ర్త‌ కూడా అత్త‌కే స‌పోర్ట్ చేయ‌డంతో…పుట్టింటికి వ‌చ్చింది రాధ.! ఇంటొకిచ్చిన రాధ తండ్రితో…నాన్న మా అత్త‌ను చంపాలి దానికోసం ఏదైనా ఉపాయం చెప్పు అన్న‌ది.అదేంట‌మ్మా …? నీ ఆలోచ‌న త‌ప్పు…ఇలా చేయ‌కూడ‌ద‌ని తండ్రి వారించిన‌ప్ప‌టికీ., చెబుతావా.? లేదా నన్ను చ‌చ్చిపోమంటావా.? అంది.! కూతురి ఆవేశాన్ని అర్థం చేసుకున్న తండ్రి…స‌రే ఇదిగో ఈ పౌడ‌ర్ రోజూ మీ అత్త తినే అన్నం లో కొంచెం కొంచెం క‌లుపుతూ పో…ఇది విషం కాబ‌ట్టి కొన్ని రోజుల త‌ర్వాత మీ అత్త చ‌నిపోతుంది అప్పుడు నువ్వు హ్యాపీ గా ఉండొచ్చ‌ని త‌న త‌యారు చేసిన పౌడ‌ర్ ప్యాక్ చేసి కూతురికి ఇస్తాడు తండ్రి.!

కానీ ఓ ష‌ర‌తు…ఈ విష‌యం ఎవ్వ‌రికీ తెలియొద్దు…అంత‌కుమించి…మీ అత్త‌తో నువ్వు చాలా ప్రేమ‌గా ఉండాలి లేదంటే నిన్ను అనుమానిస్తుంద‌ని కూతుర్ని అత్తారింటికి పంపిస్తాడు తండ్రి.!

మెట్టినింటికొచ్చిన కోడ‌లిలో చాలా మార్పు క‌నిపిస్తుంది అత్త‌కు… అన్ని ప‌నులు తానే చేయ‌డం…ఇంట్లో ఎవ‌రికి ఏ అవ‌స‌ర‌మొచ్చినా తానే చేయ‌డంతో…కోడల్ని చాలా ప్రేమ‌గా చూసుకుంటుంది అత్త‌.! కోడ‌లు మాత్రం త‌న ప‌ని తాను కానిస్తూనే ఉంది…అత్త‌కు పెట్టే అన్నంలో త‌న తండ్రి ఇచ్చిన పౌడ‌ర్ ను క‌లుపుతూనే ఉంది.ఇలా రెండు, మూడు నెల‌లు గ‌డిచాక‌….

అత్తాకోడ‌ళ్ళ మ‌ద్య అనుబంధం పెరిగిపోయింది.

ఓ రోజూ హుటాహుటిన తండ్రి ద‌గ్గ‌రికి వెళ్లింది కూతురు.! నాన్నా… విషానికి ఏదైనా విరుగుడు ఉంటే ఇవ్వండి.మా అత్త చాలా మంచిది.న‌న్ను కూతురి కంటే ఎక్కువ‌గా చూసుకుంటుంది.ఆమె బ‌తికి ఉండాలి…ఏదైనా చేయండి…మీరిచ్చిన పౌడ‌ర్ ను నా చేతుల్తో నేనే రోజు కొంత అన్నంలో క‌లిపి ఇచ్చాను.

నా చేతులారా త‌ల్లిలాంటి అత్త‌ను చంపుకోను…ఏదైనా చేయండని ఏడుస్తూ తండ్రి కాళ్ల మీద ప‌డింది కూతురు.

దానికి ఆ తండ్రి…పిచ్చిదాన నువ్వు ఆవేశంలో అన్నావ‌ని నేనెలా విష‌మిస్తా…? నేనిచ్చింది బ‌లానికి సంబంధించిన పౌడ‌ర్….కొత్త క‌దా నువ్వు అడ్జెస్ట్ అవ్వ‌డానికి టైమ్ ప‌డుతుంద‌ని నాకు తెలుసు…అందుకే అలా చేశాన‌ని చెబుతాడు తండ్రి.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube