దారుణం: నాగదోషం తనకు ఉందని కూతుర్ని నరబలి ఇచ్చిన తల్లి..!

కంప్యూటర్ యుగంలో కూడా కొందరు ప్రజలు మూఢవిశ్వాసాలను బలంగా నమ్ముతూ హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.కొద్ది నెలల క్రితం మదనపల్లెలో బాగా చదువుకున్న వ్యక్తులే మూఢనమ్మకాలతో ప్రాణాలు పోగొట్టుకున్నారు.

 Atrocity The Mother Who Sacrificed Her Daughter Said That She Had Snake Bites-TeluguStop.com

ఆ ఘటన మరువకముందే దేశవ్యాప్తంగా చాలా మంది మూఢ విశ్వాసాలతో తమ ప్రాణాలను తీసేసుకుంటున్నారు.తాజాగా ఒక మహిళ కూడా అంధ విశ్వాసాలతో తన కన్నబిడ్డనే చంపేసింది.

ఈ హృదయ వికారమైన దుర్ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాటి తండాలో చోటు చేసుకుంది.

 Atrocity The Mother Who Sacrificed Her Daughter Said That She Had Snake Bites-దారుణం: నాగదోషం తనకు ఉందని కూతుర్ని నరబలి ఇచ్చిన తల్లి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వివరంగా తెలుసుకుంటే రెండున్నర ఏళ్ల క్రితం బానోతు భారతి మేకలపాటి తండాకు చెందిన ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకుంది.

అయితే ఆరు నెలల క్రితం ఈ దంపతులకు ఒక పండంటి బిడ్డ జన్మించగా తమ బిడ్డకు ఈషా అని నామకరణం చేశారు.ఐతే ఒకరోజు మేకలపాటి తండా కు వచ్చిన ఒక వ్యక్తి భారతికి నాగ దోషం ఉందని చెప్పాడు.

దీంతో బాగా కంగారు పడిపోయిన సదరు మహిళ పూజలు చేయడం ప్రారంభించింది.అయితే ఆ రోజు నుంచి ప్రతి రోజూ పూజలు చేసిన ఆమె తనకు నాగదోషం ఎలా తప్పుతుందోనని బాగా ఆలోచించి తీవ్రమానసిక ఒత్తిడికి గురి అయ్యింది.

ఈ క్రమంలోనే ఏప్రిల్ 15వ తేదీన అనగా గురువారం రోజు సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన బిడ్డను దేవుడి పటాలు ముందు పడుకోబెట్టి పూజలు చేయడం ప్రారంభించింది.అయితే కొంత సమయానికి తన బిడ్డ ఈషా నాగు పాము లాగ ఆమెకు కనిపించింది.

అంతే, వెంటనే ఒక కత్తిని తీసుకుని ఆ చిన్నారి గొంతును విచక్షణ రహితంగా కోసేసింది.దీంతో ముక్కుపచ్చలారని ఆ ఆరు నెలల చిన్నారి క్షణాల్లోనే చనిపోయింది.

అనంతరం ఇంటి లోపల నుంచి బయటకు వచ్చిన తల్లి తన బిడ్డను చంపేశానని స్థానికులకు తెలిపింది.దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అయితే స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు.నిందితురాలు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు.ఆమెకు మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించాలని పోలీసులకు కొందరు స్థానికులు విజ్ఞప్తి చేశారు.

ఐతే కన్నతల్లే కన్న బిడ్డను చంపేసిందని తెలిసిన స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.

#Born Baby #Crime #Murder #Daughter #Mother

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు