యూపీలో పట్టపగలే దారుణం..... సోషల్ మీడియాలో వీడియో వైరల్...

బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో రోజురోజుకూ ఆడవారిపై దాడులు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి.రెండు రోజుల క్రితమే యూపీలో కొందరు వ్యక్తులు ఓ మహిళకు మద్యం తాగించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

 Atrocity On Woman In Up Video Viral On Social Media Details, Atrocity On Woman ,-TeluguStop.com

ఈ ఘటన మరువకముందే మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మతిస్థిమితం సరిగ్గాలేని ఒక యువతి తో కొందరు వ్యక్తులు చాలా క్రూరంగా ప్రవర్తించారు.

ఈ ఘటనపై మీరట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దౌరాలా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సెప్టెంబర్‌ 19వ తేదీన కొందరు వ్యక్తులు పట్టపగలే ఓ యువతిని కొట్టి దారుణంగా హింసించారు.

ఇద్దరు వ్యక్తులు ఆమె కాళ్లు, చేతులను పట్టుకుని ఈడ్చుకెళ్లారు.

మిగతా వారు ఆమెపై దాడి చేశారు.ఈ ఘటన జరుగుతున్న సమయంలో చుట్టుపక్కలు చాలా మంది ఉన్నప్పటికీ ఆమెను ఎవరూ కాపాడలేదు.

ఆమెపై దాడిని కొందరు మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేసి వీడియోను పోలీసులకు షేర్ చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

ఆ బాధిత మహిళాకు ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియోను చూసిన చాలామంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మన దేశంలో ఉన్న మహిళలకు ఎప్పటికీ రక్షణ ఉండదని కొంతమంది కామెంట్లు చేస్తే, మరి కొంతమంది ఇలాంటి వాటిని చూసి మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి అని కూడా కామెంట్ చేస్తున్నారు.అధికారంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఏం చేస్తుందని కూడా మరి కొంత మంది కామెంట్ చేస్తున్నారు.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా సమాచారం ప్రకారం,ఉత్తరప్రదేశ్‌లో 2022 జనవరి నుండి ఆగస్టు వరకు మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 56,083 కేసులను నమోదు చేసింది.

మహిళలపై నేరాలకు సంబంధించి దాదాపు 31,000 ఫిర్యాదులు గత ఏడాది జాతీయ మహిళా కమిషన్ కి అందాయి.యూపీలో 2020తో పోలిస్తే 2021లో మహిళలపై నేరాలు 30 శాతం పెరిగాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube