కెనడాలో ఖలిస్తాన్ సపోటర్ల దారుణం.. ఇందిరా గాంధీ హత్యను ప్రదర్శిస్తూ ర్యాలీ!

అవును, కెనడాలో ఖలిస్తాన్ ( Khalistan )మద్దతుదారులు ఓ దారుణమైన చర్యకు పాల్పడ్డారు.తాజాగా అక్కడ ఓ ర్యాలీ నిర్వహించారు.

 Atrocity Of Khalistan Supporters In Canada.. Rally Showing The Assassination Of-TeluguStop.com

ఐతే అది మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను స్పష్టంగా తెలియజేస్తుంది.కాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ ఘటనను చాలా తీవ్రంగా ఖండిస్తూ.

ఇది హేయమైన చర్యగా అభివర్ణించారు.కెనడా ప్రభుత్వానికి ఈ దారుణమైన విషయాన్ని తెలియజేయాలని ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను డిమాండ్ చేశారు.

కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఇందిరా గాంధీ హత్యను ప్రదర్శన రూపంలో ఇస్తూ 5 కి.మీ కవాతు నిర్వహించారు.దానికి సంబంధించినటువంటి వీడియోను కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ వీడియోలో ఇందిరా గాంధీ( Indira Gandhi ) దిష్టిబొమ్మను ప్రదర్శించడం చాలా స్పష్టంగా చూడవచ్చు.రక్తంతో తడిసిన చీరలో ఈ దిష్టిబొమ్మకు ధరించి, ఇందిరాగాంధీ హత్య దృశ్యాన్ని మళ్లీ రూపొందించే ప్రయత్నం చేశారు.అంతేకాకుండా ఇందిరా గాంధీని చంపిన ఇద్దరు సిక్కు అంగరక్షకులను కూడా ఇక్కడ దిష్టిబొమ్మల రూపంలో చూపించారు.మిలింద్ డియోరా ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు… “ఇందిరా గాంధీ హత్యకు సంబందించిన దృశ్యాలను ప్రతిబింబించేలా కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో 5 కిలోమీటర్ల సుదీర్ఘ కవాతు నిర్వహించారు.

దీనిని చూసి ఒక భారతీయుడిగా నేను దిగ్భ్రాంతికి గురయ్యాను.ఇది ఒక దేశ చరిత్రను గౌరవించడం ఎంతమాత్రమూ కాదు, భంగపరచడమే అవుతుంది.” అని అన్నారు.

అంతేకాకుండా వారు ఓ దేశ ప్రధానమంత్రి హత్యకు సంబందించిన దృశ్యాలను బహిరంగంగా ప్రదర్శించారు.అదొక తీవ్రవాద చర్య.దీనికి దేశ ప్రజల ఐక్య ప్రతిస్పందన అనేది అవసరం… అంటూ పేర్కొన్నారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా ఈ ఘటనను చాలా తీవ్రంగా ఖండించారు.

మిలింద్ దేవరా పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ.కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను.

ఇది చాలా దారుణమైన చర్య.విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.

జైశంకర్( S.Jaishankar ) ఈ విషయాన్ని కెనడా అధికారులతో సంప్రదించాలని ఈ సందర్భంగా వారంతా డిమాండ్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube