నాగర్ కర్నూల్ లో దారుణం.. అదనపు కట్నం ఇవ్వలేదని మామను కొట్టి చంపిన అల్లుడు..!

ఇటీవలే కాలంలో మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి.మనిషి కేవలం డబ్బు, ఆస్తిపాస్తులకే విలువ ఇస్తున్నాడు.

 Atrocity In Nagarkurnool Son-in-law Beat Uncle To Death For Not Giving Extra D-TeluguStop.com

సాటి మనుషుల పట్ల కర్కశంగా వ్యవహరించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది.ఈ క్రమంలోనే ఓ వ్యక్తి చెడు వ్యసనాల బారిన పడి అప్పుల పాలయ్యాడు.

ఆ అప్పులు తీర్చలేక అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధించాడు.అదనపు కట్నం ఇవ్వలేదని పిల్లను ఇచ్చిన మామను కొట్టి చంపిన ఘటన గురువారం అర్ధరాత్రి నాగర్ కర్నూల్ ( Nagarkurnool )జిల్లాలో చోటుచేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Telugu Extra Dowry, Nagarkurnool, Son-Latest News - Telugu

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.నాగర్ కర్నూలు జిల్లా ఉప్పుంతల మండలం మర్రిపల్లి గ్రామంలో సాయిబాబా (25) అనే వ్యక్తి చెడు వ్యసనాల బారిన పడి ఎప్పుడు మద్యం సేవిస్తూ కుటుంబ బాధ్యతలను మరచి దొరికిన చోటల్లా అప్పులు చేశాడు.ఇక ఊర్లో కొత్త అప్పు దొరకకపోవడం,అప్పు ఇచ్చినవాళ్లు అప్పు తీర్చమనడంతో ఏం చేయాలో తెలియక సాయిబాబా తన భార్యతో అదనపు కట్నం( Extra dowry ) తీసుకురావాలని చిత్రహింసలు పెట్టేవాడు.

Telugu Extra Dowry, Nagarkurnool, Son-Latest News - Telugu

ఈ విషయం తెలిసిన మామ కూతురి కాపురం నిలబెట్టేందుకు కొంత డబ్బు ఇచ్చాడు.అవి సరిపోలేదంటూ, ఇంకా డబ్బులు తేవాలని భార్యను కొట్టి పుట్టింటికి పంపించాడు.ఆ తర్వాత గురువారం రాత్రి భార్య ఇంటికి వెళ్లి అత్త పై దాడి చేశాడు.ఆ తర్వాత మామ కోసం గ్రామాల్లో వెతుక్కుంటూ ఉండగా పొలం వద్ద ఉన్నాడని తెలియడంతో అక్కడికి వెళ్లి మామతో గొడవపడి క్షణికావేశంలో మామను చంపేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

పోలీసులకు( Poice ) సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.పరారీలో ఉన్న నిందితుడు సాయిబాబా కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube