అప్పుడప్పుడు సమాజంలో జరిగే కొన్ని ఘటనలు చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది.మరీ ముఖ్యంగా గ్రామాల్లో జరిగే దారుణాలకు కొదువే ఉండదు.
కులం పేరుతోనో లేదంటే ఇంకేదైనా కారణంతోనే ఊర్లలోని నుంచి వెలేయడం లేదంటే గ్రామంలో ఊరేగించడం లాంటివి చేస్తుంటారు.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఓ దారుణమైన ఘటన అందరినీ కలిచి వేస్తోంది.
అదేంటంటే ఓ మహిళను దారుణంగా ఆ ఊరి గ్రామస్తులు వివస్త్రను చేసి ఊరంతా నగ్నంగా ఊరేగించారు.అయితే ఈ దారుణ ఘటన జార్ఖండ్ డుమ్కా జిల్లాకు సంబంధించిన ఓ పల్లెటూరిలో జరిగింది.
సదరు బాధితురాలు ఓ పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న నెపంతోనే ఇలా చేశారని తెలుస్తోంది.ఈ బాధిత మహిళకు ఇది వరకే పెళ్లి కాగా.ఆమె గ్రామానికి చెందిన మరో పెళ్లైన వ్యక్తితో వెళ్లిపోయింది.ఇక ఆ వ్యక్తి భార్య, అలాగే ఆయన తరఫున కుటుంబ సభ్యులు ఇతరులు ఆయన్ను, బాధితురాలిని వెతుకుతూయ చివరకు ఆ మహిళను పట్టుకున్నారు.
ఇక ఈ సందర్భంగా ఆ బాధిత మహిళపై దారుణంగా దాడి చేశారు.ఏకంగా ఆ మహిళ మెడలో బూట్లు దండగా చేసి ఆమె మెడలో వేశారని తెలుస్తోంది.
ఈ విధంగా బూట్లు ఆమె మెడలో వేసి ఊరంతా ఆమెను ఊరేగించారు గ్రామస్తులు.ఇక ఆ మహిల గ్రామంలోని ఇద్దరు తన దగ్గరి నుంచి ఏకంగా రూ.25,000 దొంగిలించారని, నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
కాగా మహిళతో వెళ్లిపోయిన వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇక అతని భార్యతో పాటు 12 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు రిజస్టర్ చేశారు పోలీసులు.
వీరిందరినీ త్వరలోనే పట్టుకుని సచట్ట పరంగా శిక్షిస్తామంటూ తెలిపారు.
.