ఏపీలో దారుణం.. దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేసిన దుండగులు.. ?

ఏపీలో గత కొద్ది రోజుల క్రితం వరుసగా ఇక్కడున్న దేవాలయాలపై దాడులు జరిపి విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనలు ఆందోళనను కలిగించాయి.ఈ నేపధ్యంలో ఈ అపవాదు ప్రభుత్వం పై పడింది.

 Atrocities In Ap Thugs Who Destroyed Idols Of Gods-TeluguStop.com

దీంతో చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం మొత్తానికి ఈ దాడులను నివారించ గలిగింది.

ఇక ఇలాంటి వివాదాలు, దాడులు తెరపైకి రాలేదని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరోసారి దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేయడం సంచలనంగా మారింది.

 Atrocities In Ap Thugs Who Destroyed Idols Of Gods-ఏపీలో దారుణం.. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ వివరాలు చూస్తే.కడప జిల్లా, రైల్వేకోడూరు టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఆలయంలోని దేవుళ్ల విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

కాగా ఈ దాడిలో సీత, రాముడి విగ్రహాలతో పాటు ఆంజనేయస్వామి విగ్రహాం కూడా ధ్వంసం అయ్యాయి.ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా ఈ ఘటనకు బాధ్యుడైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం.

ఇక ఈ విగ్రహల ద్వంసం పై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి.ఇన్ని రోజులుగా నిశబ్ధంగా ఉన్న వారు తాజాగా ఇలాంటి విద్వంసానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తుందంటున్నారు హిందువులు.

#Railway #Kodur #Kadapa #Damage #God Idols

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు