Pyramid Women : దారుణం: పిరమిడ్ ఎక్కిన మహిళపై అరాచకం... వైరల్ అవుతున్న వీడియోలు!

కొన్ని వందల వేల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాల్ని జనాలు చాలా సెంటిమెంట్ గా చూస్తారు.అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాయి.

 Atrocious  Anarchy On The Woman Who Climbed The Pyramid Videos Are Going Viral-TeluguStop.com

ఈ క్రమంలో వాటికి ఎటువంటి భంగం కలిగినా తట్టుకోలేరు.కాగా తాజాగా ఓ మహిళ చేసిన నిర్వాకం.

పర్యాటకుల ఆగ్రహానికి కారణమైంది.మెక్సికోలోని మయన్ పిరమిడ్ ఎక్కిన ఆమె.అక్కడ అశ్లీల నృత్యం చేసింది.దాంతో స్థానికులకు చిర్రెత్తింది.

అక్కడ వున్న సెక్యూరిటీ ఆమెని కిందకు దించి వేశారు.మయన్లకు ఆ పిరమిడ్ దైవ సమానం.

సూర్యుడిని పూజిస్తూ వారు ఆ పిరమిడ్‌ని నిర్మించుకున్నారు.దానిపైన ఆమె చేసిన డాన్స్ కి అందరికీ కోపం వచ్చింది.

దాంతో ఆమెని మొదట కిందకు దిగాలని పర్యాటకులు డిమాండ్ చేశారు.సెక్యూరిటీ ఆమెని కిందకు దింపి తీసుకెళ్లే క్రమంలో ఆమెపై స్థానికులు వాటర్ బాటిళ్లతో దాడి చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.పర్యాటకుల నుంచి పురాతత్వ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లినట్టు వీడియోలో కనబడుతోంది.

ఈ క్రమంలో ఆమె టోపీని లాగుతూ ఆమెపై వాటర్ విసిరేశారు.ఈ ఘటనను చాలా మంది తమ మొబైళ్లతో రికార్డ్ చేయగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

ఇక చాలా మంది ఆమెను లాకప్‌లో పెట్టాలనీ, జైలుకు పంపాలని డిమాండ్ చేయడం కొసమెరుపు.ఇక దీనిపై అధికారులు కూడా స్పందించారు.ఇలాంటి పురాతన కట్టడాల్ని దగ్గరనుండి చూడొచ్చుగానీ.వాటి పైకి ఎక్కి, ఇలా వాటిని కించ పరచకూడదు.కాగా దీనికి సంబంధించి.నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ (INAH) సంస్థ నిషేధాజ్ఞలు ఉన్నాయి.2006 జనవరిలో 80 ఏళ్ల ఓ ముసలావిడ.ఆ పిరమిడ్ ఎక్కి, అక్కడినుండి జారి పడి చనిపోయింది.

అప్పటి నుంచి.ఆ పిరమిడ్ ఎవరూ ఎక్కకుండా నిషేధం విధించారు.

ప్రపంచంలో ఈజిప్షియన్లకు ఎలాగైతే ప్రత్యేక నాగరికత ఉందో.మయన్లకు కూడా అలాగే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube