దారుణం: రెండేళ్ల బాలుడికి జీవిత ఖైదు పడిందక్కడ!

వినడానికే ఏదోలా వుందికదా.బహుశా ఇలాంటి వార్తలు మనదేశంలో ఎక్కడా విన్న దాఖలాలు వుండవు.

 Atrocious A Two-year-old Boy Was Sentenced To Life Imprisonment, Atrocious, Late-TeluguStop.com

అయితే ఆ దేశం పేరు చెబితే మీరు పెద్దగా ఆశ్చర్యపోరు.అవును, ఆ దేశంలో ఓ రెండేళ్ల బాలుడికి జీవిత ఖైదు ( life imprisonment )విధించారు.

ఆదేశం పేరు ఉత్తర కొరియా( North Korea ).అక్కడ వుండే కఠినమైన ఆంక్షల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.కిమ్ జోంగ్ ఉన్ రాజ్యంలో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా వింటూనే ఉంటాయి.ఇక మతపరమైన అంశాల్లో ఈ ఆంక్షలు ఇంకాస్త కఠినంగానే ఉంటాయి.

Telugu Boy, Latest, Sentenced-Latest News - Telugu

ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ రెండేళ్ల బాలుడికి జీవిత ఖైదు శిక్ష విధించినట్టు తెలుస్తోంది.దానికి కారణం ఒక్కటే.ఆ చిన్నారి తల్లిదండ్రుల వద్ద బైబిల్ వుంది.ఉత్తర కొరియాలో మతస్వేచ్ఛ చాలా తక్కువ.ముఖ్యంగా క్రీస్టియన్స్పై( Christians ) అక్కడ ఆంక్షలు చాలా తీవ్రస్థాయిలో ఉంటాయి.వారి ఇళ్లల్లో బైబిల్ ఉన్నా జైలుకెళ్లాల్సిందే.

వీరిలో చాలా మందికి ఉరిశిక్ష పడిన సందర్భాలు కూడా లేకపోలేదు.కుటుంబ యజమానులకు ఉరిశిక్ష పడితే.

సంబంధిత కుటుంబసభ్యులు జీవిత ఖైదును ఎదుర్కోవాల్సి ఉంటుంది.వారు ఎవరినీ వదలరు.

Telugu Boy, Latest, Sentenced-Latest News - Telugu

అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్( US State Department ) రూపొందించిన ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం రిపోర్ట్ ఆఫ్ 2022 ప్రకారం.ఉత్తర కొరియాలో 70వేలకుపైగా మంది క్రైస్తవులు జైలులో మగ్గుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.ఇతర మతస్థులను కలుపుకుంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.కాగా అలా జైలులో ఉన్న వారిలో ఓ రెండేళ్ల బాలుడు కూడా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆ బాలుడిగురించే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం.అతని తల్లిదండ్రుల వద్ద బైబిల్ లభించడంతో 2009లో వారిని అరెస్ట్ చేశారు.

తల్లిదండ్రులతో పాటు బాలుడిని కూడా పొలిటికల్ ప్రిజన్ క్యాంప్లో బందీగా ఉంచి, అనంతరం వారికి జీవిత ఖైదును విధించారు!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube