విక్కీ కౌశల్ తండ్రి వల్ల విసిగిపోయిన కత్రినా కైఫ్.. అప్పుడే ఏం జరిగిందంటే?

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇటీవలే ఒక్కటి  అయిన విషయం తెలిసిందే.గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట డిసెంబర్ 9న రాజస్థాన్ లో అతి కొద్ది మంది సన్నిహితులు ,స్నేహితులు, సెలబ్రిటీలు ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య ఒక్కటయ్యారు.

 Vicky Kaushal, Katrina Kaif, Vicky Kaushal Father, Shayam Kaushal,-TeluguStop.com

ఇక వీరు ప్రస్తుతం హనీమూన్  కోసం మాల్దీవ్స్ కి వెళ్లారు.అక్కడ కత్రినా కైఫ్ మెహందీ పెట్టుకున్న చేతుల ఫోటోని షేర్ చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా తన మామ శ్యామ్ కౌశల్ గురించి ఒక ఇంటర్వ్యూలో కత్రినా మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సైఫ్ అలీఖాన్ హీరోగా నటించిన ఫాంటమ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాలో పలు యాక్షన్ సన్నివేశాలకు స్టంట్ మాస్టర్ గా కత్రినా కైఫ్ వాళ్ల మామ విక్కీ కౌశల్ తండ్రి శ్యామ్ కౌశల్ పని చేశారు.అందులో జీపులోని ఉన్న హీరో హీరోయిన్ లపై సిరియన్ ఆర్మీ ఎటాక్ చేస్తుంటుంది.

దీంతో వారిపై దాడి చేయడానికి సైఫ్ అలీ ఖాన్ మిషన్ గన్ వైపు పరిగెత్తాలి.ఇటువంటి పరిస్థితులలో హీరోతో పాటు డ్రైవర్ కూడా గన్ ఫైట్ చేస్తుండగా.

హీరోయిన్ మాత్రం డోర్ వెనుక దాక్కుంటుంది.

Telugu Katrina Kaif, Shayam Kaushal, Vicky Kaushal-Movie

ఎక్స్ రా ఏజెంట్ గన్ ఫైర్ చేయకుండా దాచుకోమని చెప్పిన శ్యామ్ కౌశల్ తీరుతో అప్సెట్ అయినట్లు కత్రినాకైఫ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఇదే విషయం గురించి డైరెక్టర్ కీ కంప్లైంట్ కూడా చేసిందట.డైరెక్టర్ కబీర్ ఖాన్ సెట్ పైకి రాగానే గన్ ఇవ్వడానికి సిద్ధంగా లేరని చెప్పాను.

డైరెక్టర్ కూడా ఫైట్ సీక్వెన్స్ లు చేయడానికి కత్రినాని కూడా అనుమతించమని శ్యామ్ కౌశల్ బృందానికి తెలిపారట.అయితే హీరోయిన్లకు ఫైటింగ్ సీక్వెన్స్ లో ఫైరింగ్ కీ గన్ ఇవ్వకపోవడం అన్నది ఎప్పటినుంచో వస్తున్న విషయం తెలిసిందే.

కానీ అలా జరిగినందుకు కత్రినా గట్టిగానే ప్రయత్నించి సక్సెస్ అయ్యాను అని చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube