Atmasakshi Survey : 2014 ఫలితాలు 2024 లో రివర్స్ కాబోతున్నాయా.. ఆత్మసాక్షి సర్వేతో ఆ క్లారిటీ వచ్చేసినట్టేనా?

ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందో తెలుసుకోవడానికి ప్రముఖ సంస్థలు తరచూ సర్వేలు చేస్తున్నాయి.ఆత్మసాక్షి గ్రూప్ సర్వేలో( Atmasakshi Group Survey ) వైసీపీకి 48.

5 శాతం ఓట్లు వస్తాయని తేలింది.టీడీపీ కూటమికి( TDP Alliance ) 46.5 శాతం ఇతరులకు 3 శాతం ఓట్లు వస్తాయని ఆత్మసాక్షి గ్రూప్ చెబుతోంది.2 శాతం ఓటర్లు ఇంకా ఏ నిర్ణయానికి రాని వారి జాబితాలో ఉన్నారని సమాచారం అందుతోంది.ఆ సర్వే ప్రకారం వైసీపీకి 93 నుంచి 106 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.

లోక్ సభ స్థానాల్లో 15 నుంచి 17 స్థానాలు వైసీపీ( YCP ) సొంతమవుతాయని ఈ సర్వే చెబుతోంది.కూటమికి గరిష్టంగా 69 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే వెల్లడించడం గమనార్హం.

మరో విధంగా చెప్పాలంటే 2014 ఎన్నికల ఫలితాలు 2024లో రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే సారాంశం.చాలా సంస్థలు సర్వేల ఫలితాలను ప్రకటిస్తున్నా నియోజకవర్గాల వారీగా ప్రకటించడం లేదు.

Advertisement

ఆత్మసాక్షి సర్వేతో ఏపీలో వార్ వన్ సైడ్ కాబోతుందని క్లారిటీ వచ్చేసిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అయితే సర్వేల ఫలితాలను పూర్తిస్థాయిలో నమ్మలేమని కామెంట్లు వినిపిస్తున్నాయి.సర్వేలను నమ్ముకుని వెళ్లడానికి బదులు ప్రజల అభిమానాన్ని గెలుచుకుంటే సులువుగా ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

వైసీపీ, టీడీపీ విజయం కోసం ఇస్తున్న హామీలు సైతం ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి.

సంక్షేమాన్ని నమ్ముకుని వైసీపీ ముందుకెళుతుండగా తమ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి కూడా చేస్తామని తెలుగుదేశం చెబుతోంది.ఏ పార్టీని నమ్మాలో అర్థం కావడం లేదని న్యూట్రల్ ఓటర్లు చెబుతుండటం గమనార్హం.ఎన్నికలకు మరో 47 రోజులు ఉండగా ఎన్నికల ఫలితాలు ఏ పొలిటికల్ పార్టీకి అనుకూలంగా వస్తాయో చూడాలి.

ఈసారి ఇరు పార్టీలకు ఎన్నికల ఖర్చు కూడా భారీ స్థాయిలో ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు