ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయో తెలుసా.? స్వర్గానికా లేక నరకానికా.?

ఆత్మహత్య మహా పాపం.దేవుడు మనకంటూ ఒక జీవితాన్ని ఇచ్చాడు.

 Atmahatya Chesukunna Vari Athmalu-TeluguStop.com

మనం బతికి నలుగురిని బతికించడానికి మన జీవితం ఉండాలి కానీ చిన్న చిన్న కారణాల వల్ల మన జీవితాన్ని మనమే ముగించుకోకూడదు.ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావలి.

అందులో కొంత ఉన్నా మన సమస్యలు అన్ని తీరిపోతాయి.అయితే చిన్నప్పటి నుండి మనం స్వర్గం, నరకం అనే రెండిటి గురించి వింటూనే ఉన్నాము.

సినిమాల్లో చూస్తూనే ఉన్నాము.పుణ్యాలు చేస్తే స్వర్గానికి, పాపాలు చేస్తే నరకానికి వెళ్లారు అని మన పూర్వికులు మన ఎప్పటినుండో చెప్తూనే ఉన్నారు.

నరకంలో కఠినమైన శిక్షలు ఉంటాయి.స్వర్గం లో అయితే విలాసాలు ఉంటాయి.

అయితే ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారి ఆత్మ‌లు ఏమ‌వుతాయి? అస‌లవి ఎక్క‌డికి వెళ్తాయి? అనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా.అయితే తెలుసుకుందాం రండి.

ఆయువు ముగియ‌కుండా బ‌లవంతంగా ప్రాణాలు తీసుకోవ‌డం, ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క్ష‌మించ‌రాని నేరాల‌ని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి.ఆయువు ముగియ‌కుండా ఆత్మ‌హ‌త్య చేసుకుంటే మ‌ర‌ణ‌మ‌నే ప్ర‌క్రియ ఇంకా పూర్తికాన‌ట్టేన‌ట‌.ఆయువు తీర‌కుండా ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారి ఆత్మ‌లు న‌రకం లేదా స్వ‌ర్గానికి వెళ్ల‌వ‌ట‌.వారి ఆత్మలు ‘కామ‌లోకం’ అనే ప్ర‌త్యేక లోకంలో ఇరుక్కుని అక్క‌డే తిరుగుతాయ‌ట‌.

అంటే ఒక వ్య‌క్తికి 80 సంవ‌త్స‌రాలు ఆయుష్షు ఉంద‌నుకుంటే వారు 20 ఏళ్ల‌కే ఆత్మ‌హ‌త్య చేసుకుంటే మిగ‌తా 60 సంవ‌త్స‌రాల పాటు కామ‌లోకంలో తిరుగుతూనే ఉంటార‌ట‌.అప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణ‌మ‌నే ప్ర‌క్రియ పూర్తికాద‌ట‌.

అలా కామ‌లోకంలో ఉన్న వారి ఆత్మ‌లు భౌతిక ప్ర‌పంచాన్ని చూడ‌గ‌లుగుతాయ‌ట‌.త‌మ చుట్టూ ఏం జ‌రుగుతుందో వాటికి తెలుస్తుంద‌ట‌.

కామ‌లోకంలో ఉన్న ఆత్మ‌ల‌కు రోజూ ఒక శిక్ష‌గా గ‌డుస్తుంద‌ట‌.అస‌లు శాంతి అనేదే ఉండ‌ద‌ట‌.

మ‌ర‌ణ‌మ‌నే ప్రక్రియ పూర్త‌య్యేవ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్టుగానే ఆత్మ‌లు రోజూ ప్ర‌వ‌ర్తిస్తాయ‌ట‌.ఆత్మ‌ల‌ను చూడ‌గ‌లిగే, వాటితో మాట్లాడ‌గ‌లిగే వారికి ఇలాంటి కామ‌లోక ఆత్మ‌లు హానిని క‌లిగిస్తాయ‌ట‌.

కామ‌లోకంలో మ‌ర‌ణ ప్రక్రియ‌ను పూర్తి చేసుకున్న ఆత్మ‌లు మ‌రు జ‌న్మ కోసం వేరే దేహంలోకి వెళ్తాయ‌ట‌.అయితే ఆ జ‌న్మ మాత్రం వారికి అత్యంత బాధాక‌రంగా ఉంటుంద‌ట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube