ATM పిన్ నెంబర్ 4 అక్షరాలకు మించి ఉండకూడదా? కారణం ఏమిటి?

ఇపుడు బ్యాంక్‌కు వెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చుని, డబ్బు డ్రా చేసుకొనే పరిస్థితి లేదు.మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు ATMలు అనేవి ఎంతో ఉపయోగకరంగా మారాయి.

 Atm Pin Number Should Not Be More Than 4 Characters What Is The Reason-TeluguStop.com

ఒకప్పుడు క్యాష్ విత్‌డ్రా అనేది ఇది పెద్ద ప్రయాసతో కూడుకున్న పని.ఇక అత్యవసర సమయాల్లో డబ్బు కావాలనే వారికి చాలా ఇబ్బందిగా ఉండేది.రాను రాను టెక్నాలజీ పెరిగిపోవడంతో ATM మెషిన్లు అందుబాటులోకి రావడంతో ATM కార్డు తీసుకుని.ఇలా వెళ్లి, అలా డబ్బు తీసుకుని బయటికి వచ్చే వెసులుబాటు వచ్చింది.

ఇకపోతే ఈ నేపథ్యంలో అసలు ATM కార్డుకు పిన్ నెంబర్ 4 అంకెలు మాత్రమే ఎందుకు కలిగి ఉంటాయని చాలా మందికి ఓ డౌట్ వస్తుంది.చాలామంది ఈ విషయాన్నీ గురించి ఆలోచించి కూడా ఉండరు.

అసలు నాలుగు అంకెలు మాత్రమే ఎందుకు పెట్టారనే వివరాల్లోకి వెళితే… స్కాటిష్ శాస్త్రవేత్త జాన్ అడ్రియన్ షెపర్డ్ బారన్ 1969లో ATM యంత్రాన్ని కనుగొన్నారనే విషయం తెలిసిందే. మొదట్లో ATM పిన్ 6 నంబర్లతో వుండేదట.

అయితే ఈ విధానం వల్ల చాలా మంది పిన్ నంబర్ మరచిపోవడం జరుగుతుండేది.

Telugu Digits, Atm Pin Number, Atmpin, Latest-Latest News - Telugu

ఈ విషయంలో కస్టమర్లనుండి ఎక్కువ మంది ఫిర్యాదులు రావడంతో అంతా సులువుగా గుర్తుంచుకునేందుకు వీలుగా ఉండేలా దాన్ని 4 నంబర్లకు కుదించారు.అయితే 6 నెంబర్లు ఉండడం వల్ల గుర్తుంచుకోవడం ఇబ్బంది అయినా.ఈ నంబర్‌ను హ్యాక్ చేయడం చాలా కష్టం.

ఇక, ATM ఆవిష్కర్త జాన్ అడ్రియన్ షెపర్డ్ బారన్.ఇండియాలో జన్మించారనే విషయం చాలా మందికి తెలీదు.

మేఘాలయ షిల్లాంగ్‌లో 1925లో ఆయన జన్మించారు.ప్రపంచవ్యాప్తంగా క్యాష్ డిస్పెన్సర్‌ను ఏర్పాటు చేసిన తర్వాత.

దాదాపు 53 ఏళ్ల తర్వాత తొలిసారిగా అడ్రియన్ షెపర్డ్ జన్మించిన మేఘాలయలోని ఓ ఆస్పత్రిలో తొలిసారిగా మెషిన్‌ను అమర్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube