యువకునికి ఏటీఎంలో షాకిచ్చిన అపరిచితుడు.. ఏం జరిగిందో తెలుసుకునే లోపు దారుణం.. ?  

atm card fraud and stranger withdraw cash after change atm card, chittoor, sbi atm, card fraud, withdraw cash, change atm card - Telugu Card Fraud, Change Atm Card, Chittoor, Sbi Atm\\', Withdraw Cash

నేడు లోకంలో ఏమాత్రం అమాయకంగా కనిపించినా, అపరిచితులను నమ్మినా నిలువునా మునిగి పోవడం ఖాయం.నిత్యం ఎన్నో మోసాలు బయటపడుతున్నా కూడా ఇంకా మోసపోతునే ఉన్నారు అమాయకులు.

TeluguStop.com - Atm Card Fraud And Stranger Withdraw Cash After Change Atm Card

నలుగురి మధ్యకు వెళ్లినప్పుడు మన నీడను కూడా నమ్మకపోవడం ఉత్తమం అని ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో కొందరు.ఇక అజాగ్రత్తగా వ్యవహారించి అపరిచితున్ని నమ్మిన పాపానికి ఓ అమాయక చక్రవర్తి సుమారుగా లక్షరూపాయలు కోల్పోవలసి వచ్చిన ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది.

ఆ వివరాలు చూస్తే.

TeluguStop.com - యువకునికి ఏటీఎంలో షాకిచ్చిన అపరిచితుడు.. ఏం జరిగిందో తెలుసుకునే లోపు దారుణం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

యాదమరి మండలం కీనాటంపల్లెకు చెందిన చంద్రశేఖర్‌ (32) తన డబ్బులు తీసుకోవడానికి ఈ నెల 20వ తేదీన చిత్తూరు నగరంలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు వెళ్లాడట.

అదేసమయంలో సర్వర్ లో తలెత్తిన అసౌకర్యం వల్ల అందులో నుండి డబ్బులు రాలేదట.ఈ తతంగం అంతా పక్కనే ఉండి గమనిస్తున్న ఓ అపరిచిత వ్యక్తి తాను డబ్బులు తీసిస్తానని చెప్పడంతో అతన్ని నమ్మిన చంద్రశేఖర్ ఏటీఎం కార్డు ఇచ్చి, పిన్‌ నెంబర్ కూడా చెప్పాడట.

ఇక ఆ ఆ మోసగాడు ఇచ్చిన డబ్బులు తీసుకుని ఇంటికెళ్లిన చంద్రశేఖర్ సదరు వ్యక్తి మోసాన్ని గ్రహించ లేదు.అయితే మళ్లీ ఏటీఎం వద్దకెళ్లినపుడు తన కార్డు మార్చేసిన విషయాన్ని గుర్తించిన చంద్రశేఖర్ వెంటనే అకౌంట్ చెక్ చేయించగా, ఇతని ఖాతా నుంచి రూ.97,800 విత్‌ డ్రా అయినట్లు చూపించిదట.వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలుపగా కేసు నమోదు చేసుకున్న వారు మోసగాన్ని గుర్తించే పనిలో పడ్డారట.

#Change Atm Card #SBi Atm' #Card Fraud #Chittoor #Withdraw Cash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు