ఏటీఎం పిన్ మరచిపోయారా..? డోంట్ వర్రీ ఇలా ఫాలో అయిపోండి అంతే...!

టెక్నాలజీ పెరిగేకొద్ది మనిషికి సుఖాలు ఎక్కువవుతున్నాయి.ఇంతకుముందు బ్యాంకులో డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకు బయట పడిగాపులు కాస్తూ తీసుకోవాల్సిన పరిస్థితుల నుండి ఒక కార్డు తీసుకొని ఏటీఎం మిషన్ లో పెడితే మీ అకౌంట్లో ఉన్న డబ్బు ఎంత కావాలంటే అంత బయటికి క్షణాల్లో తీసుకోవచ్చు.

 Forget Your Atm Pin Don't Panic, Follow This Procedure, Atm, Atm Pin Number, Mon-TeluguStop.com

ఇకపోతే తాజా రోజుల్లో మార్కెట్ లో వస్తువుల కొనుగోలు చేయాలన్న ఏ చిన్న పని కైనా సరే ఏటీఎం కార్డు తో పని కానిచ్చేస్తున్నారు.ఇంత బాగా ఉపయోగపడుతున్న ఏటీఎం కార్డు యొక్క పిన్ నెంబర్ కొన్నిసార్లు కొంతమంది మర్చిపోతూ ఉంటారు.

అలాగని ఆ నాలుగు అంకెల పిన్ నెంబర్ చాలా సులువుగా పెట్టుకుంటే కూడా కష్టమే.

ఒకవేళ ప్రస్తుతం ఉన్న ఏటీఎం కార్డు పిన్ నెంబర్ మరచిపోతే ఎలా అని అనుకుంటున్నారా…? అయితే ఇప్పుడు అలాంటి భయపడాల్సిన అవసరమే లేదు, చాలా సింపుల్.మొదటగా మీరు మీ బ్యాంకు కు సంబంధించిన ఏటీఎం దగ్గరికి చేరుకోవాలి.ఆ తర్వాత మీకు నచ్చిన భాషను ఎంచుకుని అందులో బ్యాంకింగ్ అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి.

ఆ ఆప్షన్ ఎంచుకోగానే అనేక రకాల ఆప్షన్లు కనపడతాయి అందులో పిన్ రీసెట్ లేదా పిన్ జనరేట్ అనే ఆప్షన్ మీకు కనబడుతుంది.ఇంకేముంది అది సెలెక్ట్ చేసుకొని అక్కడ అడిగిన మీ అకౌంట్ నెంబర్, దానికి జతచేసిన ఫోన్ నెంబర్ ను అడుగుతుంది.

ఇక అంతే ఆ వివరాలను ఎంటర్ చేస్తే సరి.

Telugu Atm Machine, Atm Pin Number, Withdraw-

ఆ తర్వాత మీరు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్ కి ఓటిపి వస్తుంది.అక్కడ మీ ఓటిపి ఎంటర్ చేస్తే చాలు.ఆ తర్వాత ఏటీఎం కొత్త పిన్ నాలుగు అంకెలను ఎంటర్ చేయమని అడుగుతుంది.

మీకు గుర్తుండే విధంగా వాటిని ఎంటర్ చేసి ఓకే అంటే… ఇక అంతే, ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఏటీఎం కార్డు యొక్క పిన్ సెట్ అయినట్లే.ఇక ముందర అదే పిన్ తో మీరు కొనసాగవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube