అమెరికాలో అట్లతద్ది...ఘనంగా ఏర్పాటు చేసిన ఆప్కో

Atlataddi Celebrations At Ohioapco

తెలుగు పండుగలకు ఓ ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంది అదేంటంటే ఎవరి ఇళ్ళలో వారు పండుగలను జరుపుకునే విధంగా కాకుండా అందరూ కలిసి మెలిసి, కుటుంభ సమేతంగా లేదా ఇరుగుపొరుగు అందరూ కలిసి వైర భేదం లేకుండా జరుపుకుంటారు.తెలుగు రాష్ట్రాల నుంచీ వివిధ దేశాలకు వలసలు వెళ్ళిన వారు సైతం ఆయా దేశాలలో తెలుగు పండుగలను కన్నుల పండుగగా నిర్వహించుకుంటారు.

 Atlataddi Celebrations At Ohioapco-TeluguStop.com

తాజాగా అమెరికాలో మొట్ట మొదటి సారిగా, ఎన్నడూ లేని విధంగా ఆంధ్రా పీపుల్ ఆఫ్ సెంట్రల్ ఒహియో (ఆప్కో) అట్లతద్ది పండుగను వైభవంగా నిర్వహించింది.


 Atlataddi Celebrations At Ohioapco-అమెరికాలో అట్లతద్ది…ఘనంగా ఏర్పాటు చేసిన ఆప్కో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతి తక్కువ కాలంలో తెలుగు వారికి ఎంతో దగ్గరైన సంస్థ ఆప్కో.

అమెరికాలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ, తెలుగు వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నో తెలుగు పండుగలను వినూత్నంగా నిర్వహిస్తూ అందరికి చేరువ అయ్యింది.ఈ క్రమంలోనే తెలుగు నాట ఏ విధంగా మహిళలు అట్లతద్ది ని జరుపుకుంటారో అదేవిధంగా సాంప్రదాయ బద్దంగా ఆప్కో తరుపున మహిళలు పెద్ద ఎత్తున ఈ వేడుకలను నిర్వహించుకున్నారు.

సుమారు 60 మంది మహిళలు సాంప్రదాయ వస్త్ర అలంకరణతో ఈ వేడుకలలో పాల్గొన్నారు.ఉదయం నుంచీ రాత్రి వరకూ ఉపవాసాలు ఉన్నారు.

అనంతరం గౌరీ పూజను నిర్వహించి వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటూ శాస్త్రబద్దంగా పూజలు నిర్వహించుకుంటూ వ్రతాన్ని పూర్తి చేశారు.


మహిళలు అందరూ ఎంతో నిష్టగా, భక్తి శ్రద్దలతో అట్లతద్దిని జరుపుకున్నారు.తెలుగు సాంప్రదాయాలు ప్రకారం ఆంధ్రా పిండి వంటలు వండించి, విందు భోజనాలు చేసి ఎంతో సంతోషంగా గడిపారు.తరువాత సంస్థ ఏర్పాటు చేసిన స్టార్ మహిళ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదిలాఉంటే అమెరికా గడ్డపై మొట్టమొదటి సారిగా అట్లతద్ది వేడుకలు జరిగాయని, గతంలో ఎన్నడూ అమెరికాలో అట్లతద్దిని జరుపుకోలేదని, ఇకపై ఆప్కో అట్లతద్దిని ప్రతీ ఏటా జరుపుకుంటుందని తెలిపారు నిర్వాహకులు.

#Atlataddi #OhioApco #Gauri Pooja

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube