ఏపీలో ఆ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు ! నోటిఫికేషన్ విడుదల

ఏపీలో మరో ఎన్నికల సంగ్రామం మొదలు కాబోతుంది.ఈ అధికార పార్టీ వైసిపి అభ్యర్థిని నిలబెట్టి బోతుండగా, మిగతా పార్టీలు అభ్యర్థిని నిలబెడితే లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

 Athmakuri Asembly By Election Notification Relised , Ap, Ap Cm Jagan, Tdp, Chand-TeluguStop.com

ఏపీ మంత్రిగా బాధ్యతల్లో ఉందగానే  మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మాత్తుగా మృతి చెందారు.దీంతో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది ఆత్మకూరు ఒక ఎన్నికకు ఈనెల 30వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు జూన్ 23న పోలింగ్ నిర్వహించి , జూన్ 26న ఫలితాలు విడుదల చేస్తారు.

ఆత్మకూరు ఉప ఎన్నికతో పాటు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది .మొత్తం మూడు పార్లమెంట్ ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.
   ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితమే ఏపీ సీఎం జగన్తో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆయన తనయుడు మేకపాటి విక్రమ్ రెడ్డి జగన్ ను కలిశారు.రాజా మోహన్ రెడ్డి పెద్ద కుమారుడైన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది.

ఈ స్థానంలో గౌతమ్ రెడ్డి భార్య కు టికెట్ ఇచ్చి గెలిపించాలని జగన్ భావిస్తుండగా, మేకపాటి రాజమోహన్ రెడ్డి మాత్రం తన రెండో కొడుకు విక్రమ్ రెడ్డి కి అవకాశం ఇవ్వాలని జగన్ ను కోరినట్లు సమాచారం.అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ని నిలబడతారా లేదా అనే విషయంలో సరైన క్లారిటీ లేదు.

కానీ బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ఇక్కడ తమ పార్టీ తరపున అభ్యర్దిని నిలబెడతాము అంటూ ప్రకటించారు.గతంలో టీడీపీ లో మేకపాటి రాజా మోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించిన నేపథ్యం లో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో  టీడీపీ తరపున అభ్యర్దిని నిలబెట్టే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube