వైరల్ వీడియో: పరుగులో ఓడి మరీ మనసులు గెలిచిన అథ్లెట్‌ ...!

కొన్నికొన్ని సందర్భాల్లో చూస్తే మంచితనం ఇంకా బతికి ఉందేమో అని అనిపిస్తుంది.తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.

 Athlete Stops At Finish Line, Lets Opponent Win, Diego Mentriga, Bronze Medal ,-TeluguStop.com

ఒక అథ్లెట్ ఎవరు ఊహించని విధంగా చేసి అందరి మనసులను గెలుచుకున్నాడు.తాను గెలిచే అవకాశం ఉండి కూడా కావాలని ఓడిపోయి నిజంగా మనసున్న వ్యక్తిగా నిలిచిపోయాడు.

ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు, ఆటగాళ్లు, సోషల్ మీడియా లో ఉన్న వ్యక్తులు అతను చేసిన పనిని ప్రశంసిస్తున్నారు.పరుగులో ఓడిపోయినా, తన మంచితనంతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నాడని సోషల్ మీడియాలో ఆయనపై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

స్పెయిన్ దేశంలోని బార్సిలోనా లో ట్రయథ్లాన్ ని నిర్వహించారు.ఇక ఈ పోటీలలో భాగంగా పరుగుపందెం అలాగే మరికొన్ని ఆట పోటీలు జరిపారు.

ఇకపోతే స్పెయిన్ దేశానికి చెందిన ఓ అథ్లెట్ డియాగో మెట్రిగో పరుగుపందెం పోటీలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.కేవలం కొన్ని సెకండ్స్ లో అతని పరుగు పూర్తయి అతడు గెలవడం ఖాయం.అయితే ఆ సమయంలో ఎవరు ఊహించని విధంగా అతను ఓ పని చేశాడు.అదేమిటంటే… తన వెనుక వస్తున్న జేమ్స్ మూడో స్థానం దక్కేలా చేసి అందరి మెప్పు పొందాడు.చివరి సెకండ్లలో డియాగో తన లక్ష్యం వైపు వెళ్లకుండా, కావాలనే పక్కనున్న రైలింగ్ వైపు పరుగు పెట్టాడు.అయితే ఆ సమయంలో తాను ఇటు వచ్చేశానేంటి అన్నట్టుగా నటిస్తూనే, మళ్ళీ పరుగు ప్రారంభించాడు.

అయితే అదే సమయానికి తన వెనుక ఉన్న ఇంగ్లాండ్ అథ్లెట్ జేమ్స్ ముందుకు వెళ్లి మూడో స్థానాన్ని పొందాడు.అయితే ఈ సన్నివేశాన్ని మొత్తం అక్కడ ఉన్న ప్రేక్షకులు చివరికి మూడవ స్థానం పొందిన జేమ్స్ తో సహా అందరూ చూశారు.

నిజానికి ఈ విషయం పరంగా అక్కడున్న వారు పూర్తిగా ఆశ్చర్యపోయారు.పరుగు పందెం ముగిసిన తర్వాత తనను గెలిపించిన కారణంగా జేమ్స్ వెంటనే డియాగో మెట్రిగో కు ధన్యవాదాలు తెలిపాడు.

అసలు మేట్రిగో ఇలా చేయడానికి గల కారణం చూస్తే.మేట్రిగో కంటే జేమ్స్ వేగంగా పరిగెత్తాడట.

దీంతో అతడు మూడో స్థానంలో గెలుస్తాడని మేట్రిగో ఊహించాడు.అయితే అనుకోకుండా టార్గెట్ చేరుకునే సమయంలో జేమ్స్ నిర్వహించడంతో మెట్రిక్ గెలిచే అవకాశం వచ్చింది.

కాకపోతే, ఆయన మూడో స్థానానికి జేమ్స్ అర్హుడు అని భావించి మేట్రిగో ఇలా చేసి గెలిపించాడు.మేట్రిగో చూపిన క్రీడాస్ఫూర్తిని అక్కడ ఉన్న ప్రేక్షకులందరూ చప్పట్లతో అతనిని మెచ్చుకున్నారు.

ప్రస్తుతం ఈ సన్నివేశం మొత్తానికి ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube