పెళ్లిరోజున ఎమోషనల్ పోస్ట్ చేసిన అతియా శెట్టి.. జీవితకాలం గుర్తుండిపోయే రోజు ఇదంటూ?

తాజాగా టీం ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి ల జంట మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.ఇక టీం ఇండియా ఓపెనర్ గా కేఎల్ రాహుల్ మనందరికీ సుపరిచితమే.

 Athiya Shetty And Kl Rahul First Official Wedding Pics Out Social Media Details,-TeluguStop.com

ఒకవైపు క్రికెట్ లో ఓపెనర్ గా రాణిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటించాడు కేఎల్ రాహుల్.ఇక అతియా శెట్టి ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అన్న విషయం మనందరికీ తెలిసిందే.

తాజాగా ఈ జంట పెళ్లి ముంబైలోని సునీల్ శెట్టి అత్యంత విలాసవంతమైన ఖండాల ఫామ్ హౌస్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఆ ఫోటోలను చూసిన అభిమానులు నెటిజన్స్ బాలీవుడ్ సెలబ్రిటీలు సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఆ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కొంతమంది కే ఎల్ రాహుల్ అభిమానులు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

ఈ నూతన వధువు వరులకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి.

ఇక వీరి పెళ్లిలో సునీల్ శెట్టి, అలాగే కేల్ రాహుల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఇక అందులో అతియా శెట్టి సోదరుడు అహన్ శెట్టి మిఠాయిలు పంచుతూ సంతోషంగా కనిపించారు.అయితే పెళ్లి బట్టల్లో ఈ జంటను చూసి క్యూట్ కపుల్ సూపర్ జోడి అంటూ కామెంట్ల కోసం కురిపిస్తున్నారు.

ఇక పెళ్లిరోజు తాజాగా అతిగా శెట్టి తన ఇన్స్టాగ్రామ్ లో తన మ్యారేజ్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.

నేను ఎలా ప్రేమించాలో నేర్చుకుంటా.ఈరోజు మాకు అత్యంత విలువైన రోజు.సన్నిహితుల మధ్య మేము ఒకటయ్యాము.

ఇది మా జీవితంలో మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చింది.మీ కృతజ్ఞతలు ప్రేమ ఆశీర్వాదాలు మా ప్రయాణంలో తోడుగా ఉంటాయని కోరుకుంటున్నాం అని పోస్ట్ చేసింది అతియా శెట్టి.

అయితే ఈ పోస్ట్ పై కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube