అచ్చెన్న‌కు అమ‌రావ‌తి కాటు.. ఏం చేస్తారు..?

ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడి ముందు పార్టీ ప‌రంగా అనేక స‌వాళ్లు స్వాగ‌తం ప‌లుకుతున్నాయి.సామాజిక వ‌ర్గాల కూర్పు ప‌రంగా .

 Atchenna Naidu Facing Amaravathi Problem,tdp,chandra Babu Naidu,atchenna Naidu,a-TeluguStop.com

బీసీల‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని చంద్ర‌బాబు చెప్పినా.పార్టీకి అన్నీ తామై న‌డిపిస్తున్న క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని ద‌రి చేర్చుకోక‌పోతే.

పార్టీ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం పొంచి ఉంద‌నేది వాస్త‌వం.పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌స‌మ‌యంలో న‌డిపించిన వారు క‌మ్మ‌సామాజిక వ‌ర్గానికి చెందిన వారే.

ఇక‌, 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో బాబును హైలెట్ చేసింది కూడా క‌మ్మ వ‌ర్గానికి చెందిన మీడియానే.అదేస‌మ‌యంలో క‌మ్మ పారిశ్రామిక వేత్త‌లు.

అయితే.ఇప్పుడు ఈ వ‌ర్గానికి పార్టీ ప‌దవుల్లో అన్యాయం జ‌రిగింద‌నే టాక్ వ‌స్తోంది.

వీరిని శాంత ప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఏపీ అధ్య‌క్షుడిగా అచ్చెన్న‌పైనే ఎక్కువగా ఉంటుంది.అదేస‌మ‌యం లో జ‌గ‌న్‌కు దీటుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించాలి.చంద్ర‌బాబు ఇమేజ్‌ను పెంచేలా అడుగులు వేయాలి.ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ముందు అనేక రాజకీయ స‌మ‌స్య‌ల‌తో పాటు.

ప్ర‌భుత్వం తీసుకున్న విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు కూడా వెంటాడుతున్నాయి.వీటిలో అత్యంత కీల‌కం.

అమ‌రావ‌తి విష‌యం. రాష్ట్ర రాజ‌ధానిగా అమ‌రావతిని టీడీపీ స‌పోర్టు చేస్తోంది.

అమ‌రావ‌తిని జీవ‌నాడిగా పేర్కొంటోంది.అంతెందుకు ఇప్ప‌టికీ.

అమ‌రావ‌తి ఉద్య‌మం కొన‌సాగుతోందంటే.దీని వెనుక అన్నీ తానై చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Telugu Amaravathi, Atchenna, Chandra Babu, Farmers, Kala Venkat Rao, Ysrcp-Telug

అమ‌రావ‌తిని నిల‌బెట్టుకునేందుకు అనేక రూపాల్లో ప్ర‌య‌త్నిస్తున్నారు అయితే, ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా.అచ్చెన్న దారెటు? అనేది కీల‌క ప్ర‌శ్న‌.ఆయ‌న శ్రీకాకుళానికి చెందిన నాయ‌కుడు.సో.విశాఖ రాజ‌ధాని అయితే.శ్రీకాకుళం తొంద‌ర‌గా అభివృద్ధి చెందుతుంద‌నే టాక్ ఉంది.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు కూడా అచ్చెన్న కానీ, ఆయ‌న అన్న కొడుకు, ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు కానీ.అమ‌రావ‌తి విష‌యంలో ప‌న్నెత్తు మాట మాట్లాడ‌లేదు.

అదేసమ‌యంలో విశాఖ‌పైనా కామెంట్లు చేయ‌లేదు.

అంతెందుకు నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధ్యక్షుడిగా ఉన్న క‌ళా వెంక‌ట్రావు కూడా ఇలానే వ్య‌వ‌హ‌రించారు.

అమ‌రావ‌తిలో పెద్ద ఎత్తున ఉద్య‌మాలు జ‌రిగినా.క‌ళా వెంక‌ట్రావు.

రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడి హోదాలో అక్క‌డ‌కు అడుగు కూడా పెట్ట‌లేదు.అనేక విష‌యాలు మాట్లాడినా.

అమ‌రావ‌తి విష‌యాన్ని ప్ర‌స్తావించ‌కుండానే ప‌ద‌వి నుంచి త‌ప్పుకొన్నారు.

ఇక‌, ఇప్పుడు అచ్చెన్న ఏం చేస్తారు? అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు అంటారా? ఒక‌వేళ‌.అంటే.శ్రీకాకుళం ప్ర‌జ‌ల‌కు ఏం చెబుతారు? అలా కాదు.అమ‌రావ‌తే వ‌ద్ద‌ని అంటారా ?  అలా అయితే.చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు తీసుకున్న నిర్ణ‌యం ఏమ‌వుతుంది?  లేదు.క‌ళా వెంక‌ట్రావు మాదిరిగా ఈ ఒక్క విష‌యం త‌ప్ప‌! అని ముందుకు సాగుతారా?  అలా అయితే.ఆయ‌న‌కు క‌ళా వెంక‌ట్రావుకు తేడా ఏముంటుంది? ఇలా.ఒక్క అమ‌రావ‌తి విష‌యంలోనే.అచ్చెన్నకు ప‌ద్మ‌వ్యూహం వంటి స‌మ‌స్య పొంచి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube