అవినీతి అచ్చెన్న:  గురివింద సామెతని గుర్తుచేస్తున్న వైసీపీ...!

తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న అచ్చెన్నాయుడు ఏ పరిస్థితుల్లో జైలుకు వెళ్లారో అందరికీ తెలిసిందే.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అచ్చెన్న కార్మిక శాఖ మంత్రిగా చేసిన సమయంలో ఈ‌ఎస్‌ఐలో స్కామ్ చేశారని చెబుతూ, ఏసీబీ ఆయన్ని అరెస్ట్ చేసింది.

 Tdp Leaders Targets Atchannaidu, Ycp, Esi Scam, Tdp President Post, Chandrababu-TeluguStop.com

ఓ లేఖ ఇచ్చారని చెబుతూ ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నని జైలుకు పంపారు.అయితే జైలుకు వెళ్ళాక అచ్చెన్న అవినీతి ఏమన్నా బయటపడిందా అంటే అదేం లేదు.

అచ్చెన్న ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఏసీబీ అధికారులే చెప్పారు.ఈ క్రమంలోనే ఆయన బెయిల్ మీద బయటకొచ్చారు.

అయితే ఇప్పుడు అచ్చెన్నకు చంద్రబాబు ఏపీ టీడీపీ పగ్గాలు అప్పగించారు.బీసీ సామాజికవర్గంలో కీలకంగా ఉన్న అచ్చెన్నకు పగ్గాలు ఇవ్వడం పట్ల పార్టీ సంతృప్తిగానే ఉంది.కానీ వైసీపీ అనుకూల పత్రిక అచ్చెన్న మీద విషం చల్లడం మొదలుపెట్టింది.ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో బెయిల్ మీద బయటకొచ్చిన అచ్చెన్నకు అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకిత వస్తుందని ఓ స్టోరీ వేసింది.

అసలు అవినీతిలో కూరుకుపోయిన నేతకు అధ్యక్ష పదవి ఇవ్వడం ఏమిటని పార్టీ సీనియర్‌ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారట.

ఇక్కడ ఆ వైసీపీ మీడియా అచ్చెన్న అవినీతిలో కూరుకున్నారని, సొంత పార్టీ నేతలే అచ్చెన్న అధ్యక్షుడు అవ్వడం పట్ల అసంతృప్తిగా ఉన్నారని సొంత కామెంటరీ ఇచ్చేసింది.

అసలు అచ్చెన్న అధ్యక్షుడు అవ్వడం వల్ల టీడీపీలో ఎలాంటి అసంతృప్తి కనబడటం లేదు.అదే సమయంలో ఆ మీడియా అచ్చెన్న అవినీతి గురించి మాట్లాడుతూ, గురివింద సామెతని గుర్తు చేసిందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

అచ్చెన్న ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఏసీబీ అధికారులే చెప్పారని, కానీ 11 ఛార్జీషీట్లలో ముద్దాయిగా ఉన్న జగన్ ఇప్పుడు సీఎంగా ఉన్నారని, అలాగే 43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఈడీ ఎటాచ్‌మెంట్ కూడా చేసిందని గుర్తుచేస్తున్నారు.ఇంకా పలువురు వైసీపీ నేతల మీద పలు కేసులు ఉన్నాయని, ఇలా వైసీపీలోనే అవినీతి నేతలు ఉంటే, ఆ మీడియా గురివింద సామెతలాగా అచ్చెన్నని టార్గెట్ చేసిందని ఫైర్ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube