జైలులో చంద్రబాబు నిరాహార దీక్ష అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన..!!

Atchannaidu Sensational Announcement Of Chandrababu Hunger Strike In Jail Details, TDP, Atchannaidu, Chandrababu , Chandrababu Hunger Strike, Rajahmundry Central Jail , Chandrababu Naidu Arrest, Mota Mogiddam, Nara Bhuvaneshwari, Lokesh

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో( Rajahmundry Central Prison ) ఉన్న సంగతి తెలిసిందే.

 Atchannaidu Sensational Announcement Of Chandrababu Hunger Strike In Jail Detail-TeluguStop.com

దాదాపు 20 రోజులకు పైగా చంద్రబాబు జైల్లోనే ఉంటున్నారు.మరోపక్క చంద్రబాబుకు బెయిల్ తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్ని రకాలుగా న్యాయపోరాటాలు చేస్తూ ఉన్నారు.

చంద్రబాబు అరెస్టు అయిన నాటి నుండి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కేడర్ పలు నిరసనలు కార్యక్రమాలు చేపడుతూనే ఉంది.

నేడు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా “మోత మోగిద్దాం” అనే నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఢిల్లీలో లోకేష్ తో( Nara Lokesh ) పాటు పలువురు నాయకులు రాష్ట్రంలో మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు( Atchannaidu ) ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.ఇదిలా ఉంటే అక్టోబర్ రెండవ తారీకు జైలులోనే చంద్రబాబు నిరాహార దీక్ష చేయబోతున్నట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు.

అక్రమ అరెస్టుకు నిరసనగా చంద్రబాబు దీక్ష చేయబోతున్నారు.అదే రోజు నారా భువనేశ్వరి కూడా నిరాహార దీక్ష చేస్తారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ పార్టీ నాయకులు కూడా పాల్గొంటారని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube