టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్న ? కానీ అదే ఇబ్బందంట

2024 ఎన్నికల్లో గెలుపు జెండా రెపరెపలాడింది కాబట్టి ఎప్పటి నుంచి పార్టీలో నూతనోత్సాహం తీసుకువచ్చే విధంగా ప్రయత్నించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.దానిలో భాగంగానే పార్టీలో సమూల మార్పులు చేర్పులు చేపట్టాలని చూస్తున్నారు.

 Atchannaidu Kinjarapu,chandrababu,tdp, Kala Venkatrao,appolitics, Telangana-TeluguStop.com

ఇప్పటికే పెద్ద ఎత్తున నాయకులు అధికార పార్టీ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండటం, పార్టీలో ఉన్న నాయకులు భవిష్యత్తుపై బెంగ ఏర్పడటం వంటి కారణాలతో చంద్రబాబు పార్టీలో కొత్త ఉత్చాహం తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.మహానాడు లోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ కమిటీ, ఏపీ, తెలంగాణ అధ్యక్షులు, కమిటీల ఎన్నికలను పూర్తి చేయాలని ముందుగా భావించారు.

కానీ కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా వాయిదా వేశారు.మరికొద్ది రోజుల్లోనే ఈ ఎంపికలను పూర్తి చేయాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు.

ఎలాగూ టిడిపి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎంపిక లాంఛనమే.ఏపీ తెలంగాణ పార్టీ అధ్యక్షులు గా ఎవరిని నియమించాలనే విషయంపై కొద్దిరోజులుగా చంద్రబాబు కసరత్తు చేస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కళావెంకట్రావు ఉన్నారు.ఆయనను తప్పించి ఆ స్థానంలో కొత్త అధ్యక్షుడిగా, చురుకైన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయగల సత్తా ఉన్న నాయకులను ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

టీడీపీ అధికారంలో ఉండగా నియమించిన కళా వెంకట్రావు ప్రస్తుతం ఆ పదవికి సెట్ అవ్వరని, నిరంతరం అధికార పార్టీ పై ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించాల్సి ఉంటుందని, దానికి రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు చొరవ తీసుకోవాల్సి ఉండడం వంటి కారణాలతో మెతక వైకిరితో ఉండే కళా వెంకట్రావు నెగ్గుకురావడం కష్టమని, ఫైర్ బ్రాండ్ నాయకులు అవసరం అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.

Telugu Appolitics, Chandrababu, Kala Venkatrao, Telangana-Telugu Political News

మొన్నటి ఎన్నికల్లో కళా వెంకట్రావు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందడం కూడా ఆయనను తప్పించాలనుకోవడానికి కారణమట.ప్రస్తుతం చంద్రబాబు కోరుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తిగా ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక్కరే కనిపిస్తున్నారట.ఆయన ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన వారు కావడం, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవ్వడంతో ఆయన అయితేనే సరిగ్గా సరిపోతారని బాబు ఆయన పేరు పరిగణలోకి తీసుకున్నారు.

అయితే అచ్చెన్న ఏదో ఒక అంశం తో తరుచుగా వివాదాల్లో ఉండడమే కాకుండా, అధికార పార్టీ పై మరీ దూకుడుగా వ్యవహరించడం, పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఆయన మరింతగా చెలరేగిపోయే అవకాశం ఉంటుందని లెక్క వేస్తున్నారు.

ఆయన చేసే వ్యాఖ్యలు తరువాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆలోచించకుండానే విమర్శలు చేసే అవకాశం ఉండడం, ఇవన్నీ లెక్కలోకి బాబు తీసుకుంటున్నారు.

చంద్రబాబు కనుక అచ్చెన్న ను ఏపీ టీడీపీ అధ్యక్షుడు గా నియమిస్తే కొత్త తలనొప్పులు వస్తాయనే ఉద్దేశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.దీని కారణంగానే కాస్త వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.

అచ్చెన్న కాకపోతే ఆ పదవికి మాజీ మంత్రి టిడిపి ఆవిర్భావం నుంచి ఉన్న విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును పరిగణనలోకి తీసుకోవాలని చూస్తున్నారట.ఈ విషయంలో స్పష్టమైన క్లారిటీ కి రాలేకపోవడంతోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఎంపిక ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube