ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం( TDP ) మరియు జనసేన( Janasena ) కలిసి పోటీ చేయబోతున్నట్లు పవన్ ఆల్రెడీ ప్రకటించడం తెలిసిందే.చంద్రబాబుతో( Chandrababu Naidu ) ములాఖాత్ అయిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు బయట మీడియా సమావేశంలో పవన్( Pawan Kalyan ) స్పష్టం చేయడం జరిగింది.
ఇదే సమయంలో త్వరలో జాయింట్ కమిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.ఇదిలా ఉంటే తాజాగా తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించి ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం అనంతరం మీడియాతో అచ్చెన్నాయుడు( Atchannaidu ) మాట్లాడుతూ.టీడీపీ- జనసేన నేతలతో కలసి జేఏసీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేయడం జరిగింది.
జేఏసీతో రాష్ట్రస్థాయిలో సమన్వయం చేసుకుంటూ పని చేస్తాం.ప్రభుత్వ విధానాలపై ప్రజాక్షేత్రంలోనే పోరాడుతాం.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో లోకేష్ కి సంబంధమే లేదు.అలాంటప్పుడు లోకేష్ పై కేసు ఎలా పెడతారు అని అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోపక్క ఆగిపోయిన లోకేష్ యువగళం పాదయాత్ర.ఈనెల 29వ తారీకు నుండి ప్రారంభించబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేయడం జరిగింది.
ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు.త్వరలోనే రాష్ట్రానికి వచ్చి ఆగిపోయిన చోట నుండి మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నారు.