బొత్స పందెం కి రెడీ నా, ఎవరు ముందు కొండ ఎక్కితే వారే కుర్రోళ్లు అంటున్న మాజీ మంత్రి  

Atchannaidu Challenges Botsa Satyanarayana - Telugu Atchannaidu, Botsa Satyanarayana, Tdp, Ysrcp, బొత్స సత్యనారాయణ

ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ మంత్రి,వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కు ఒక పందెం విసిరారు.ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముసలివారు అయ్యారు అంటూ బొత్స ఇటీవల చేసిన వ్యంగ్య వ్యాఖ్యలకు అచ్చెన్నాయుడు ప్రతిగా సవాల్ విసిరారు.

Atchannaidu Challenges Botsa Satyanarayana - Telugu Atchannaidu, Botsa Satyanarayana, Tdp, Ysrcp, బొత్స సత్యనారాయణ-Political-Telugu Tollywood Photo Image

ఎవరు యువకులు,ఎవరు ముసలివాళ్లు తేలాలి అని , చంద్రబాబు తో పాటు బొత్స సత్యనారాయణ కాలినడకన తిరుమల కొండా ఎక్కాలని, ఎవరు ముందు ఎక్కితే వారే కుర్రోళ్లు అని అచ్చెన్నాయుడు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసారు.ఈ పందెం కి మీరు రెడీనా అంటూ బొత్స కు సవాల్ విసిరారు.

వరుస ట్వీట్ లతో అచ్చెన్నాయుడు బొత్స కు సవాల్ విసిరారు.ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు ముసలివారు అయ్యిపోయారు అంటూ వ్యగ్యంగా వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడారు.

ఈ నేపథ్యంలో వరుస ట్వీట్స్ తో బొత్స కు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు.ఎవరు ముసలి వాళ్ళో-ఎవరు యువకులో తేల్చటానికి ఒక చిన్న పోటీ పెడదాము.

బొత్స సత్యనారాయణ గారు ( ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ లోని ఏ మంత్రిగారైనా సరే ) చంద్ర బాబు గారి కన్నా ముందు కాలినడకన తిరుమల కొండ ఎక్కండి? ఎవరు ముందు ఎక్కితే వారు కుర్రోళ్ళు.మిగిలిన వారు ముసలోళ్ళు ! ఈ పోటీకి బొత్సగారూ సిద్ధమేనా ! పోటీకి సిద్ధంకాకపోతే ముసలివాణ్ణి అని పత్రికాసమావేశంలో ఒప్పుకోండి! అని అంటూ ట్వీట్ లతో సవాల్ విసిరారు.

తాజా వార్తలు

Atchannaidu Challenges Botsa Satyanarayana-botsa Satyanarayana,tdp,ysrcp,బొత్స సత్యనారాయణ Related....