జగన్ కు సవాల్ విసిరిన అచ్చెన్నాయుడు..!!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం వైఎస్ జగన్ కి సంచలన సవాల్ విసిరారు.ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రంలో జరుగుతున్న పాలన పై రెఫరెండం గా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే అందులో టీడీపీ పార్టీ ఓడిపోతే.పూర్తిగా పార్టీని మూసివేస్తామని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.గూడూరు పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా లోకేష్ చేసిన చాలెంజ్ స్వీకరించకుండా జగన్ తన తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని పేర్కొన్నారు.

 Tdp Atchan Naidu Challenged To Jagan-TeluguStop.com

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో టీడీపీ పార్టీ నేతల హస్తం ఉందని గతంలో ఆరోపణలు చేశారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినాగాని ఎప్పటి వరకు.వివేకానంద రెడ్డి హత్య కేసులో టిడిపి పార్టీ హస్తం ఉందని నిరూపించలేక పోయారని పేర్కొన్నారు.

 Tdp Atchan Naidu Challenged To Jagan-జగన్ కు సవాల్ విసిరిన అచ్చెన్నాయుడు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్వయాన చిన్నాన హత్య కేసు పరిష్కరించలేని సీఎం సామాన్యులకు ఇక ఏమి న్యాయం చేస్తారని అచ్చం నాయుడు ప్రశ్నించారు.తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నారని అందువల్లే టిడిపి నాయకులు పర్యటిస్తున్న ప్రాంతాలలో మంచి స్పందన వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.

కచ్చితంగా టిడిపి తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

.

#YS Jagan #TirupatiBy #Atchan Naidu #YSVivekananda #Nara Lokesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు