పెళ్లిలో భోజనాల దగ్గర అందుకు కొట్టుకుసచ్చారంట ..!

పెళ్లి అంత సందడిగా జరిగింది.అంతా సరదాగా భోజనాలు చేసే సమయం.

 At The Wedding Meals, Two Families Are Fighting ,wedding Meals, Two Families ,fi-TeluguStop.com

సరిగ్గా అక్కడే మొదలయ్యింది.బంధువులు ఎవరూ సరిగ్గా రాలేదు అంటూ పెళ్లి కొడుకు తరుపు వాళ్ళు అన్నారట ఇక అంతే గొడవ స్టార్ట్ అయింది.

మాట మాట పెరిగి పెద్ద వాగ్వాదం జరిగింది.వివరాల్లోకి వెళితే….

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని కోళ్లపర్రులో రెండు కుటుంబాలు పెళ్లి భోజనాల విషయంలో గొడవ జరిగింది.

ఆ ఘటనలో ఇరు వర్గాలు కొట్టుకున్నారు.

అయితే ఇక్కడ జరిగిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.ఇక అసలు విషయం ఏమిటంటే.

ఈనెల 15వ తేదీన స్థానికంగా ఓ వివాహం జరిగింది.పెళ్లి అంతా చాలా బాగా జరిగింది.బంధువులు ఎవరింటికి వాళ్ళు వెళ్లి పోయారు.వాళ్ళ సంప్రదాయాల ప్రకారం ఆ కుటుంబం పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత యానాల భోజనాలు ఏర్పాటు చేస్తారు.అదే విధంగా పెళ్లి అయిన మూడు రోజుల తర్వాత యానాల విందు ఏర్పటు చేశారు.అయితే ఈ విందుకు ఎక్కువమంది బంధువులు రాకపోవడంతో గొడవ మొదలైంది.

భోజనాలు సక్రమంగా జరగలేదని బంధువులు ఎవరూ సరిగ్గా రాలేదని బంధువులు పెళ్లి కొడుకు తల్లిదండ్రులని టార్గెట్ చేశారు.

భోజనాలు జరిగున్నంత సేపు ఏదొక మాటలు వాళ్ళని సూటి పోటీ మాటలతో రెచ్చగొట్టారు.

దీంతో మాటా మాటా పెరిగింది.అయితే భోజనాల విషయంలో మొదలైన గొడవ కొట్లాట వరకూ దారి తీసింది.

రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.కర్రలు పిడిగుద్దులతో ఒకరి పై ఒకరు రెచ్చిపోయారు.

ఈ ఘర్షణలో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి.కాగా వీరిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

గొడవ సద్దుమనగపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube