పాపం.. ఆ సమయంలో శిల్పా శెట్టి ఫోన్ నెంబర్, ప్రైవేట్ వీడియో నెట్‌లో పెట్టారట!

గత కొన్ని రోజుల నుండి బాలీవుడ్ లో శిల్పా శెట్టి పేరు బాగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.తన భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రీకరణ కేసులో అరెస్ట్ అవగా ఇటీవలే అతడికి బెయిల్ కూడా అందింది.

 At That Time Shilpa Shettys Phone Number And Private Video Were Posted In Net-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇందులో శిల్పా శెట్టి ను కూడా విచారించగా అందులో తనది ఎటువంటి బాధ్యత లేదని తెలిసింది.కానీ శిల్పాశెట్టికి గతంలోనే చేదు అనుభవం ఎదురయింది.

బాలీవుడ్ కు చెందిన శిల్పా శెట్టి మోడల్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషలో కూడా నటించింది.తన అందంతో ఎంతోమంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.ఇక ఈమె 1993లో బాజిగర్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాగా ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

 At That Time Shilpa Shettys Phone Number And Private Video Were Posted In Net-పాపం.. ఆ సమయంలో శిల్పా శెట్టి ఫోన్ నెంబర్, ప్రైవేట్ వీడియో నెట్‌లో పెట్టారట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక తెలుగు సినీ ఇండస్ట్రీకి సాహస వీరుడు సాగర కన్య సినిమాతో అడుగు పెట్టి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.అంతేకాకుండా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.

ఇక 2009లో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది.రాజ్ కుంద్రా కు అదివరకే పెళ్లి అవ్వగా తనకు విడాకులు ఇచ్చి శిల్పా శెట్టిను పెళ్లి చేసుకున్నాడు.

ఇక 2010లో శిల్పా శెట్టి సినీ ఇండస్ట్రీకి దూరమవ్వగా మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అడుగు పెట్టింది.బుల్లితెరపై కూడా పలు షో లలో జడ్జిగా చేసింది.

ఇదిలా ఉంటే శిల్పా శెట్టి కి గతంలో చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి.అందులో తను పదేళ్ళ క్రితమే ఓ ఘటనను ఎదుర్కొంది.

మంచి స్టార్ హోదాలో ఉన్న సమయంలో శిల్పా శెట్టి ఫోన్ నెంబర్ లీక్ అయిందని అంతే కాకుండా ఓ ప్రైవేట్ వీడియో కూడా నెట్ లో పెట్టారని వార్తలు వినిపించాయి.ఇక ఆమె అభిమానులు కూడా తనను పాపం అంటూ ఒక స్త్రీని అలా చేయడం కరెక్టు కాదు అని బాధ పడ్డారు.ఇక పదేళ్ల క్రితమే ఈ ఘటన ఎదుర్కొన్న శిల్పా శెట్టి ఇటీవలే తన భర్త పోర్న్ కేసులో కూడా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది.

రెండు నెలల కిందట తన భర్త రాజ్ కుంద్రా బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు.నీలి చిత్రీకరణ వ్యవహారంలో దొరికిపోయాడు.వాటిని చిత్రీకరించి ఆన్ లైన్ లో పబ్లిష్ చేశాడు.

దీంతో అతనితోపాటు మరికొంతమంది కూడా బయటపడగా.ఈ వ్యవహారంలో శిల్పా శెట్టి ను కూడా విచారించారు.

ఇక అందులో తనకు ఎటువంటి సంబంధం లేదని తెలియడంతో ఆమె నిర్దోషి అని తేలింది.ఇక రాజ్ కుంద్రాకు జూలై 19న కేసు నమోదు కాగా వెంటనే అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇక ఇటీవలే అతడికి బెయిల్ మంజూరు అందగా జైలు నుండి విడుదల అయ్యాడని తెలిసింది.

#Phone Number #Private Videp #Shilpa Shetty #Raj Kundra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు