దేవుడి దగ్గరకు పొతే... నిజంగా పోవడమేనా ....

ఎవరైనా చనిపోతే దేవుడి దగ్గరకు పోయారని అంటారు.దేవుడు స్వర్గంలో ఉంటాడనే నమ్మకం కాబట్టి చనిపోయిన వారు కూడా స్వర్గానికి వెళతారని భావిస్తారు.

 At Least 350 Pilgrims Killed, 600 Injured Near Makkah-TeluguStop.com

దేవుడి దగ్గరకు పోవడమంటే దర్శనం కోసం.చావు కోసం కాదు గదా.కానీ పుణ్య క్షేత్రాలలో తొక్కిసలాట కారణంగా వందలమంది ప్రాణాలు కోల్పోతున్నారు.గురువారం మక్కాలో జరిగింది కూడా ఇదే.ఇది ముస్లీములు హజ్ యాత్రకు వెళ్ళే సీజన్.ప్రపంచ వ్యాప్తంగా ముస్లీములు సౌదీ అరేబియాలోని మక్కాకు వెళతారు.

కాని వెళ్ళిన వారంతా సురక్షితంగా తిరిగి వస్తారనే నమ్మకం లేదు.కారణం అక్కడ జరిగే తొక్కిసలాట.

ఈ విషాద ఘటన ఇప్పటకి అనేకసార్లు జరిగింది.గురువారం జరిగిన తొక్కిసలాటలో 350 మందికి పైగా చనిపోయారు.600 మందికి పైగా గాయపడ్డారు.చనిపోయిన వారి, గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

మక్కాకు వెళ్ళే మార్గంలో మీనా అనే పొడవాటి లోయ ఉంది.ఇది మక్కా నుంచి మూడు మైళ్ళ పొడవు ఉంది.

ఇక్కడ లక్షలాది మంది గుడారాలు వేసుకొని ఉన్నారు.మక్కాకు ప్రపంచ దేశాల నుంచి యాత్రికులు, భక్తులు వస్తారు కాబట్టి కంట్రోల్ చేయడం చాలా కష్టమైనా పని.అందుకే తొక్కిసలాటలు జరుగుతున్నాయి.మక్కాలో 1990, 1994, 1998, 2001, 2003, 2004, 2006లో తొక్కిసలాటలు సంభవించాయి.2006 తరువాత మళ్ళీ ఈ రోజు జరిగింది.1990లో 1,426 మంది చనిపోయారు.ఇప్పటివరకు ఎక్కువ మంది చనిపోయిన దుర్ఘటన ఇదే.ఇంత ఆధునిక కాలంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube