మొదట గ్లాస్ ముక్క అనుకున్నాడు.. తర్వాత డైమండ్ అని తెలిసింది.. అదెంత ధర పలికిందంటే..?

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు.ఒక్కోసారి ఎలాంటి కోరికలు కోరుకోకుండానే అనుకోకుండా బంగారు నిధులు లేదా విలువైన వస్తువులు దొరుకుతుంటాయి.తాజాగా అమెరికా దేశం, అర్కాన్సాస్‌( Arkansas ) రాష్ట్రంలోని ముర్‌ఫ్రీస్‌బోరోలోని క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్‌ను మొదటిసారి సందర్శించిన వ్యక్తికి అనుకోకుండా 4.87 క్యారెట్ల వజ్రం దొరికింది.

 At First He Thought It Was A Piece Of Glass Then He Came To Know That It Was A D-TeluguStop.com
Telugu Carat Diamond, Arkansas, Craterdiamonds, Jerry Evans, Murfreesboro-Latest

లెపాంటోకు చెందిన జెర్రీ ఎవాన్స్ పేరు గల ఆ వ్యక్తి మొదటగా డైమండ్ ను చూసి అది ఒక గ్లాస్ ముక్క అని భావించాడు.అయినా దాన్ని పడేయలేదు.అదృష్టం కొద్దీ దానిని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు.తర్వాత జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా (GIA) చేత చెక్ చేయించాడు.GIA ఆ వస్తువు దాదాపు రంగులేని వజ్రం అని ధృవీకరించింది.కొన్ని వారాల తర్వాత ఎవాన్స్‌ను సంప్రదించింది.

ఈ వార్తతో ఎవాన్స్ చాలా సంతోషించాడు.అది ఒక క్రిస్టల్ డైమండ్( Crystal Diamond ) అని తనకు తెలియదని చెప్పాడు.

అతను, అతని స్నేహితులు పార్క్ వద్ద వజ్రంలా కనిపించే ప్రతిదాన్ని సేకరిస్తున్నారు.

Telugu Carat Diamond, Arkansas, Craterdiamonds, Jerry Evans, Murfreesboro-Latest

ఎవాన్స్ తన ఆవిష్కరణ గురించి క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్‌కి( Crater of Diamonds State Park ) తెలియజేశాడు.పార్క్ అసిస్టెంట్ సూపరింటెండెంట్, వేమన్ కాక్స్, GIA ద్వారా వజ్రాన్ని గుర్తించి, దానిని పార్కుకు నివేదించడం ఇదే మొదటిసారి అని చెప్పాడు.అతను ఎవాన్స్‌ను అతని చారిత్రాత్మక అన్వేషణకు అభినందించాడు.పార్క్‌లో అధికారికంగా నమోదు చేసుకోవడానికి అతన్ని స్వాగతించాడు.2020లో మౌమెల్లెకు చెందిన ఒక వ్యక్తి 9.07 క్యారెట్ బ్రౌన్ డైమండ్‌ని ఇక్కడే కనుగొన్నాడు.తర్వాత పార్క్‌లో ఎవాన్స్ కి దొరికిన డైమండ్‌యే అతిపెద్దది.దీని విలువ సుమారు రూ.1 కోటి 66 లక్షలు పలకవచ్చని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube