వైరల్: ఆ వయసులో సర్జరీతో ఎత్తు పెరిగిన వ్యక్తి..!- At 28 Years Old The Man Height Increased By 2 Inches

man, height, increased, at that age, cosmetic surgery, dallas, america, alfonso flores, 6 feet, height, 28 years age - Telugu 28 Years Age, 6 Feet, Alfonso Flores, America, Cosmetic Surgery, Dallas, Height, Increased, Man, Surgery

మనలో చాలామంది ఎంత డబ్బు ఉన్న.ఎన్ని ప్రయత్నాలు చేసిన చివరికి ఎత్తు పెరగడం చాలా కష్టంగా ఉంటుంది.

 At 28 Years Old The Man Height Increased By 2 Inches-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న దానికంటే మరింత ఎత్తు పెరగాలన్న ఆశ మనలో ఎంతోమంది కలలు ఉండడం సహజమైన ఆశ.అందులో ముఖ్యంగా యువకులు యుక్తవయసు సమయానికి వచ్చేసరికి  ఆరడుగులు పెరగాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు.అయితే అలా కొందరికి మాత్రమే కోరిక నెరవేరుతుంది.అందరికీ నెరవేరదు.ఇందులో భాగంగానే ఓ వ్యక్తి తన చిన్నప్పటి నుంచి ఆరడుగులు ఉండాలని భావించిన చివరికి ఆయన ఆశ తీరలేదు.ప్రస్తుతం ఆయనకు 28 ఏళ్ల వయసులో తన కోరికను నిజం చేసుకున్నాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

 At 28 Years Old The Man Height Increased By 2 Inches-వైరల్: ఆ వయసులో సర్జరీతో ఎత్తు పెరిగిన వ్యక్తి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమెరికాలోని డల్లాస్ నగరానికి చెందిన అల్ఫాన్సో ఫ్లోరెస్ తన చిన్నప్పటి నుంచి తాను కచ్చితంగా ఆరడుగుల ఎత్తు కలిగి ఉండాలని అనుకునే వాడట.

అయితే అతని దురదృష్టం కారణంగా కేవలం 5 అడుగుల 11 అంగుళాలకే అతని ఎత్తు ఆగిపోయింది.అయితే అతను ఎంతగానో అభిమానించే ఆటగాళ్లు ఫిల్ జాక్సన్​, కోబ్ బ్రయాంట్​, మైకేల్ జోర్డాన్ లాంటి వారి లాగా తాను కూడా ఆరడుగుల ఎత్తు ఉండాలని ఎన్నో కలలు కనేవాడు.

ఇదిలా ఉండగా తన ఎత్తు మాత్రం 5 అడుగుల 11 అంగుళాలతో ఆగిపోవడంతో అతను ఎంతో బాధపడ్డాడు.అందుకే తన ఎత్తు పెరగడానికి 28 సంవత్సరాల వయస్సులో కూడా ఆపరేషన్ కు సిద్ధమైపోయాడు.

ఇలా ఆపరేషన్ చేయించుకున్న ఏడు నెలల్లోనే అతను 6 అడుగుల 1 అంగుళం ఎత్తు పెరిగేలా డాక్టర్ కెల్విన్ సర్జరీ చేశాడు.దింతో ప్రస్తుతం అల్ఫాన్సో ఆరడుగుల ఒక అంగుళం ఎత్తు ఉన్నాడు.అయితే ఈ సర్జరీ లో భాగంగా మనిషి ఎత్తు క్రమంగా పెరిగేందుకు కాలులో ఉన్న ఎముకలను కట్ చేసి ఓ డివైజ్ ను అందులో పెట్టడమే కాస్మెటిక్ సర్జరీ విధానం అని సర్జరీ చేసిన డాక్టర్ తెలియజేశారు.సర్జరీ జరిగిన తర్వాత నుండి అల్ఫాన్సో రిహాబిలిటేషన్ ప్రాసెస్ ద్వారా త్వరగా కోలుకున్నారని, కేవలం ఏడు నెలల సమయం లోనే అతడు కొత్త ఎత్తుతో అడ్జస్ట్ అయ్యి సజావుగా నడుస్తున్నట్లు తెలియజేశారు.

అయితే ఈ సర్జరీ చేసుకుంటావు అని చెప్పినప్పుడు అది నీ కుటుంబసభ్యులు సందేహించి వద్దని చెప్పిన వారిని అందరినీ ఒప్పించి మరీ ఫ్లోరోసిస్ ఈ పని చేశాడు.

#6 Feet #Increased #Dallas #28 Years Age #Surgery

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు