అశ్వధ్ధామ ప్రీరిలీజ్ బిజినెస్.. నాగశౌర్య కుమ్మేశాడుగా!  

Aswathama Pre Release Business Highest For Naga Shourya-naga Shourya,pre Release Business,telugu Movie News

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం అశ్వధ్ధామ రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా విజయంపై హీరో నాగశౌర్యతో పాటు చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

Aswathama Pre Release Business Highest For Naga Shourya-Naga Shourya Pre Telugu Movie News

ఈ సినిమాకు కథను కూడా నాగశౌర్య అందిస్తుండటం, పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే స్థాయిలో జరిగింది.

మీడియం రేంజ్ హీరోగా ఎదుగుతున్న నాగశౌర్య కెరీర్‌లోనే అశ్వధ్ధామ చిత్రం హయ్యెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమా హక్కులు ఏకంగా రూ.16.20 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.థియేట్రికల్ రైట్స్‌ రూ.10 కోట్లకు అమ్ముడవ్వగా, నాన్-థియేట్రికల్ అయిన డిజిటల్, శాటిలైట్, ఇతర రైట్స్ రూ.6.20 కోట్లకు అమ్ముడయ్యాయి.నాగశౌర్య లాంటి హీరోకు ఇంత మొత్తంలో ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం విశేషమనే చెప్పాలి.

పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అందాల భామ మెహ్రీన్ పీర్జాదా హీరోయిన్‌గా నటిస్తోంది.కాగా ఈ సినిమాను రమణ తేజ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయగా ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నాగశౌర్య తల్లిదండ్రులు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ సినిమాను జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.

తాజా వార్తలు

Aswathama Pre Release Business Highest For Naga Shourya-naga Shourya,pre Release Business,telugu Movie News Related....