నాగ శౌర్య కొత్త సినిమా మోషన్ పోస్టర్.. కాస్తా డిఫరెంట్ గా

యువ కథానాయకుడు నాగ శౌర్య టాలీవుడ్ లో నటుడుగా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.అయితే అతని కెరియర్ లో హిట్ సినిమాలు భాగానే ఉన్నా వాటి కారణంగా అతనికంటే ఇతర హీరోలకి లేదంటే దర్శకుడుకి ఎక్కువ పేరు వచ్చింది.

 Aswathama Motion Poster Movie Motion Poster-TeluguStop.com

సోలో హీరోగా తనని తానూ ప్రూవ్ చేసుకోవాలని శౌర్య విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈ ప్రయత్నానికి ఫ్యామిలీ కూడా సపోర్ట్ దొరకడంతో సొంత బ్యానర్ లో మొదటి సారి సోలో హీరోగా చలోతో సూపర్ హిట్ కొట్టాడు.

ఆ సినిమా తన ఇమేజ్ ని మార్చేస్తుందని భావించిన ఊహించని విధంగా అది కాస్తా రివర్స్ అయ్యింది.అందులో హీరోయిన్ గా చేసిన రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యి కూర్చుంది.

అయితే చలో తర్వాత వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు పడటంతో నాగ శౌర్య కెరియర్ మళ్ళీ యధారాజా అన్నట్లు అయిపొయింది.

ఈ సారి మరింత కసిగా శౌర్య తన సొంత భ్యనర్ లో ఫ్యామిలీ డ్రామాతో మాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

ఈ సినిమాలో మెహ‌రిన్ శౌర్యకి జంట‌గా నటిస్తుంది.అశ్వథ్థామ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మోషన్ పోస్టర్ ని తాజాగా రిలీజ్ చేసారు.మోస్తాన్ పోస్టర్ లో సినిమాలో కొంత కంటెంట్ ని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేసాడు.

వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది.మరి ఈ సినిమా ఈ కుర్ర హీరోకి ఎంత వరకు అతను కోరుకున్న సక్సెస్ అందిస్తుంది అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube