అక్కడ పగటిపూట వర్షం రూపంలో కురుస్తున్న ఐరన్.... ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు...!

సాధారణంగా ఎక్కడైనా నీటి రూపంలో వర్షం పడుతుంది.కానీ అక్కడ మాత్రం ఐరన్ వర్షం రూపంలో కురుస్తోంది.

 Astronomers Discovered Giant Planet Where It Rains Iron-TeluguStop.com

ఒక గ్రహం గురించి ఖగోళ శాస్త్రవేత్తలు చేసిన కొన్ని పరిశోధనల్లో వారికి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.శాస్త్రవేత్తలు సౌర కుటుంబానికి బయట ఉన్న ఒక గ్రహానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారు.డబ్ల్యూఏఎస్‌పీ-76 బీ గా గుర్తించిన వేడిగా ఉందే ఆ గ్రహంపై ఐరన్ వర్షం రూపంలో కురుస్తోందని చెప్పారు.

అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 2400 డిగ్రీల కంటే అధిక స్థాయిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

లోహాలు అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆవిరిగా మారిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పటికీ రాత్రి సమయంలో వీచే చల్ల గాలుల వల్ల అక్కడ సాధారణ వాతావరణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అక్కడ పగటిపూట వర్షం రూపంలో కు

వర్షం రూపంలో గ్రహంపై పడిన ఐరన్ బిందువుల రూపంలోకి మారుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.రాత్రి సమయంలో ఆ గ్రహంలో చీకటి ఉంటుందని ఆ సమయంలో ఐరన్ వర్షం కురవదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కేవలం 2 రోజుల్లో ఆ గ్రహం భూమి సూర్యుని చుట్టూ ఏ విధంగా తిరుగుతుందో అదే విధంగా పరిభ్రమణం పూర్తి చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మాతృ నక్షత్రం నుండి ఆ గ్రహంపై వేల రెట్లు రేడియేషన్ పడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube