సాయిపల్లవి జాతకంలో అలా ఉందా.. వివాహంలో ఆ సమస్యలు తప్పవంటూ?

తెలుగు, తమిళ భాషల్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుని తన టాలెంట్ తో కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్లలో సాయిపల్లవి కూడా ఒకరు.వివాదాలకు దూరంగా ఉండే సాయిపల్లవి యాక్టర్ గా అవకాశాలు తగ్గిన తర్వాత డాక్టర్ గా కెరీర్ ను కొనసాగించాలని అనుకుంటున్నారు.

 Astrologer Venuswamy Comments About Heroine Saipallavi, Astrologer , Venuswamy-TeluguStop.com

అయితే ఈ హీరోయిన్ పెళ్లి గురించి మాత్రం స్పందించడం లేదు.

ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి సాయిపల్లవి జాతకం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.1992 సంవత్సరం మే 9వ తేదీన సాయిపల్లవి జన్మించిందని సాయిపల్లవి నక్షత్రం ఆశ్లేష నక్షత్రమని రాశి కర్కాటక రాశి అని వేణుస్వామి పేర్కొన్నారు.సాయిపల్లవి లగ్నం కూడా కర్కాటకం అని వేణుస్వామి అన్నారు.

చర్మ సంబంధిత సమస్యలు సాయిపల్లవిని బాధిస్తాయని వేణుస్వామి తెలిపారు.

Telugu Marrege, Astrology, Kollywood, Saipallavi, Tollywood, Venuswamy-Movie

వ్యక్తిగతంగా సాయిపల్లవి జాతకంలో పెను సంచలనాలు నమోదవుతాయని వేణుస్వామి తెలిపారు.వివాహానికి సంబంధించి ఆమెకు సమస్యలు ఎదురవుతాయని ఆ సమస్యల వల్ల దేశవ్యాప్తంగా సాయిపల్లవి పేరు వినిపిస్తుందని వేణుస్వామి అన్నారు.సాయిపల్లవిపై తల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాహన ప్రమాదాలు చేసే సమయంలో సాయిపల్లవి జాగ్రత్తలు తీసుకోవాలని వేణుస్వామి అన్నారు.

Telugu Marrege, Astrology, Kollywood, Saipallavi, Tollywood, Venuswamy-Movie

చిన్నచిన్న వివాదాల ద్వారా సాయిపల్లవి తరచూ వార్తల్లో నిలుస్తారని సాయిపల్లవి మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వమని వేణుస్వామి పేర్కొన్నారు.వచ్చే ఏడాది ఏప్రిల్ 24వ తేదీలోపు సాయిపల్లవి జీవితంలో సంచలనం చోటు చేసుకుంటుందని వేణుస్వామి అన్నారు.మరి వేణుస్వామి చెప్పిన విధంగా సాయిపల్లవి జీవితంలో జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.సాయిపల్లవికి భాషతో సంబంధం లేకుండా అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.సాయిపల్లవి పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కథ నచ్చితే మాత్రమే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ ప్లానింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube