అనసూయ, రష్మీ జాతకం చెప్పిన వేణుస్వామి.. ఏం చెప్పారంటే..?

బుల్లితెర స్టార్ యాంకర్లుగా అనసూయ, రష్మీలకు మంచి పేరు ఉంది.జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల ద్వారా అనసూయ, రష్మీ మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు.

 Astrologer Venuswamy Comments About Anchor Anasuya And Rashmi-TeluguStop.com

ప్రముఖ జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి 2021 సంవత్సరంలో అనసూయ జాతకం టాప్ లో ఉందని అన్నారు.ఈ ఏడాది అనసూయకు జాతకం ప్రకారం సినిమాలపరంగా మంచి జరుగుతుందని వేణుస్వామి అన్నారు.

2020 సంవత్సరానికి ముందు 2020 సంవత్సరానికి తర్వాత అనే విధంగా అనసూయ కెరీర్ ఉంటుందని.2021 సంవత్సరంలో అనసూయ జీవితంలో ఊహించని సక్సెస్ లు వస్తాయని వేణుస్వామి అన్నారు.అనసూయ జాతకంలో శని రైజింగ్ లో ఉండటంతో ఆమె విజయాలను సొంతం చేసుకుంటారని వేణుస్వామి పేర్కొన్నారు.రష్మీ కెరీర్ కు ఏ ప్రమాదం లేదని రష్మీ జాతకం బాగానే ఉందని వేణుస్వామి వెల్లడించారు.

 Astrologer Venuswamy Comments About Anchor Anasuya And Rashmi-అనసూయ, రష్మీ జాతకం చెప్పిన వేణుస్వామి.. ఏం చెప్పారంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రష్మీ మెంటాలిటీ వేరు అని అనసూయ క్రేజ్ అనసూయకు ఉంటే రష్మీ క్రేజ్ రష్మీకి ఉంటుందని.వర్షిణికి ఉండే క్రేజ్ వర్షిణికి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో రష్మీ, అనసూయల కంటే వర్షిణికే ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారని వేణుస్వామి తెలిపారు.వర్షిణికి వేరే షో చేయాలి కాబట్టి ఆమెను ఢీ షో నుంచి తీసేశారని కొన్నిసార్లు చెడు వల్ల మంచి జరుగుతుందని వేణుస్వామి తెలిపారు.

సీఎం జగన్ జాతకంలో కూడా చెడు వల్ల మంచి జరుగుతుందని.సీఎం జగన్ కు వ్యతిరేక మీడియా ఉన్నన్ని రోజులు ఆయన సీఎంగానే ఉంటారని వేణుస్వామి పేర్కొన్నారు.

రవితేజ చేసిన నాలుగు సినిమాలు పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాలని పవన్ కళ్యాణ్ చేయకపోవడం వల్ల రవితేజ స్టార్ అయ్యాడని వేణుస్వామి తెలిపారు.సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తరువాత నిలబెట్టుకోవడం ముఖ్యమని వేణుస్వామి పేర్కొన్నారు.

వేణుస్వామి చెప్పిన విధంగా అనసూయ, రష్మీలకు 2021 కలిసొస్తుందేమో చూడాలి.

#AstrologerVenu #Future #Rashmi #Anasuya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు