వేణు స్వామి ( Venu Swamy ) పరిచయం అవసరం లేని పేరు.వివాదాస్పద జ్యోతిష్యుడుగా పేరు పొందినటువంటి వేణు స్వామి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు.
ముఖ్యంగా ఈయన చెబుతున్నటువంటి జాతకాలు ఇటీవల కాలంలో నిజం కాకపోవడంతో పలు ట్రోల్స్ కూడా ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా ప్రభాస్ ( Prabhas ) విషయంలో ఈయన చెప్పినటువంటి జాతకం అభిమానులను ఆగ్రహానికి గురి చేయడంతో ప్రభాస్ అభిమానులు తరచూ ఈయనని ట్రోల్ చేస్తూ ఉంటారు.
ఇటీవల ప్రభాస్ నటించిన సలార్ సినిమా హిట్ కాదని వేణు స్వామి తెలిపారు.కానీ ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది దీంతో వేణు స్వామి చెప్పిన జాతకం అబద్ధమని ప్రభాస్ అభిమానులు ఈయనపై దారుణమైనటువంటి కామెంట్లు చేశారు అయితే తాజాగా మరోసారి వేణు స్వామి ప్రభాస్ నటించిన సలార్ సినిమా ( Salaar Movie ) గురించి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.ఇటీవల సలార్ సినిమా ద్వారా నష్టాలు ఎదుర్కొన్నటువంటి వారికి నిర్మాత డబ్బు తిరిగి చెల్లించారంటూ ఒక వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఈ విధంగా నిర్మాత నష్టాలను పూడ్చారు అంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ విషయంపై వేణు స్వామి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తాను ఎప్పుడో ఈ విషయాన్ని చెప్పాను కదా? అంటూ మర్యాద రామన్న సినిమాలో సునీల్ అన్నట్టుగా నే చెప్పలే చెప్పలే.అంటూ వచ్చిన ఫన్నీ మీమ్‌ను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు.దీంతో సలార్ విషయంలో తాను చెప్పినదే నిజమైందని మరోసారి వేణు స్వామి గుర్తు చేస్తూ చేస్తున్నటువంటి ఈ పోస్టు వైరల్ అవుతుంది.
మరి ఈ కామెంట్లపై ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.