జాతకం మారుస్తానని ప్రియాంకని మోసం చేసిన జ్యోతోష్కుడు....  

Astrologer Cheated Priyanka-priyanka

సాధారణంగా ప్రజలకు జాతకం, జ్యోతిష్యం వంటి విషయాలపై నమ్మకం ఉంటుంది.కానీ వాటిని అతిగా నమ్మడం వల్ల ఇబ్బందులు తప్పవు.తాజాగా విజయవాడలో ఓ యువతిని తన జాతకాన్ని మారుస్తానని చెప్పి ఓ జ్యోతిష్కుడు మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే స్థానిక పట్టణంలో ప్రియాంక అనే యువతి నివసిస్తోంది.

Astrologer Cheated Priyanka-priyanka Telugu Viral News Astrologer Cheated Priyanka-priyanka-Astrologer Cheated Priyanka-Priyanka

అయితే ఆమె ఈ మధ్య  కాలంలో ఏ పని చేసినా కలిసి రాకపోవడంతో తన జాతకంలో ఏదైనా లోపం ఉందేమోనని దగ్గర్లోని సనత్ చంద్ర అనే జ్యోతిష్కుడిని సంప్రదించింది. 

ఇది అదునుగా తీసుకున్న అతడు ఆమె జాతకంలో లోపం ఉందంటూ మాయమాటలు చెప్పాడు.

అంతటితో ఆగక తనకు పెళ్లి విషయంలో కూడా పలు దోషాలు ఉన్నాయని ఈ దోషాలు తొలగిపోవాలంటే పలు రకాల పూజలు చెయ్యాలని సూచించాడు.దీనికి గానూ బాగా ఖర్చవుతుందని చెప్పి లక్షల రూపాయలు తీసుకున్నాడు.

అయితే ఎన్ని పూజలు చేసినా తన జీవితంలో మార్పు రాకపోవడంతో ప్రియాంక తన అబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని కోరింది.దీంతో అతడు ప్రియాంకని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చంపేస్తానని బెదిరించాడు.

 

దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకున్నప్రియాంక దగ్గర్లో ఉన్నటువంటి కృష్ణ లంక పోలీస్ స్టేషన్ లో తనకు జరిగిన మోసాన్ని గురించి ఫిర్యాదు చేసింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సనత్ చంద్ర గురించి గాలిస్తున్నారు.

అలాగే మరోసారి ఇలాంటి దొంగ జ్యోతిష్కులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.    

.

తాజా వార్తలు